ఈ నెలలో భూమికి మూడిందా.? సరికొత్త సిద్ధాంతం

moonఈ భూమిపై మీకు తీర‌ని కోరిక ఏమైనా ఉందా..? త‌్వర‌గా తీర్చుకోండి. అదికూడా నెల‌లోపే. ఆల‌స్యం చేస్తే ఎప్పటికీ ఆ కోరిక నెర‌వేర‌దు. ఎందుకంటే వ‌చ్చే నెలాఖ‌రు క‌ల్లా అంటే సెప్టెంబ‌రు చివ‌ర‌కు ప్రపంచం అంతంకానుంది. భూమిమీద జీవం అనే మాట విన‌ప‌డ‌ద‌ని చెబుతున్నారు కొంద‌రు సిద్ధాంత‌క‌ర్తలు. సౌర వ్యవ‌స్థలో నిబిరూ అనే తెలియ‌ని ఒక గ్రహం ద‌ర్శన‌మిచ్చింద‌ని.. ఇది భూమిని త్వర‌లో ఢీకొంటుంద‌నే కొత్త సిద్ధాంతాన్ని తెర‌పైకి తీసుకొచ్చారు. దీని గురించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాల‌కు తెలుసున‌ని అయితే ఈ విష‌యాన్ని వారు ర‌హ‌స్యంగా ఉంచిన‌ట్లు వారు వెల్లడించారు.

సౌర వ్యవ‌స్థలో భూమికి ద‌గ్గర‌గా నిబిరూ అనే ఓ ర‌హ‌స్య గ్రహం ఉంద‌ని ..దానివెన‌కాలే ఎర్రటి రంగులో చంద్రుడు ఉన్నాడ‌ని దానిపేరు బ్లడ్‌మూన్ అని తెలిపారు. ఈ బ్లడ్ మూన్ ప్రపంచం అంతానికి సంకేత‌మ‌ని తెలుపుతూ ఓ వీడియో ఫుటేజీని యూట్యూబ్‌లో ఉంచారు. పెద్ద కక్ష్య క‌లిగిఉన్న నిబిరూ గ్ర‌హం అతి త‌ర్వ‌లో భూమిని ఢీకొని పెద్ద విధ్వంస‌మే సృష్టిస్తుంద‌ని సిద్ధాంత‌క‌ర్త‌లు వివ‌రించారు. ఇందుకు ప్రధాన కార‌ణం బ్లడ్ మూన్‌గా చెప్పుకొచ్చారు.

సూర్యకిర‌ణాలు భూమిని చేరే క్రమంలో అందులోని గ్రీన్, వ‌యోలెట్ రంగు కిర‌ణాలు ఎక్కువ‌గా భూమిని తాకుతూ ..ఎరుపు రంగు కిర‌ణాలు వెన‌క్కు నెట్టివేయ‌బ‌డి ఆ కిర‌ణాలు చంద్రుడిని తాకండంతో ఈ బ్లడ్ మూన్ రూపాంత‌రం చెందింద‌ని సిద్ధాంత‌క‌ర్తలు తెలిపారు. ఇంకా ఎన్ని బ్లడ్ మూన్స్ ఉన్నాయో తెలియ‌ద‌ని.. కానీ సెప్టెంబ‌ర్ నెల‌క‌ల్లా మ‌రో బ్లడ్ రెడ్‌ మూన్ క‌నిపిస్తే ఇక నిబిరూ గ్రహం భూమికి అతిద‌గ్గర‌లో ఉంద‌ని ప్రమాదం ముప్పు పొంచిఉంద‌ని భావించాల్సిఉంటుంద‌న్నారు సిద్ధాంతక‌ర్తలు

SHARE