శశికళ టీమ్ కు ఈసీ వార్నింగ్

0
452
ec warning to seshikala team

Posted [relativedate]

ec warning to seshikala teamతమిళనాడులో మన్నార్ గుడి మాఫియాగా చెడ్డపేరు తెచ్చుకున్న శశికళ.. తాను జైలుకు వెళ్లినా.. క్యాంప్ పాలిటిక్స్ చేసి తన వర్గానికి చెందిన పళనిస్వామిని సీఎం పీఠం ఎక్కించింది. అయితే అనుకోకుండా వచ్చిన ఆర్కే నగర్ ఉపఎన్నిక శశి టీమ్ కు నిద్రలేకుండా చేస్తోంది. దీనికి తోడు దినకరన్ నిర్వాకంతో అన్నాడీఎంకే పార్టీ గుర్తుతో పాటు పేరు కూడా వాడకూడదని ఈసీ నిబంధన పెట్టడం చిన్నమ్మకు టెన్షన్ పెంచుతోంది. అయితే తమవైన మాఫియా తెలివితేటలు చూపిస్తున్న దినకరన్ టీమ్ కు.. ఈసీ మరోసారి షాకిచ్చింది.

అన్నాడీఎంకే తమదంటే తమదని శశికళ, పన్నీర్ వర్గాలు పంచాయితీకి రావడంతో.. ఈసీ ఇద్దరికీ వేర్వేరు గుర్తులు కేటాయించి… రెండాకుల్ని రిజర్వ్ చేసింది. అప్పుడు శశికళకు టోపీ గుర్తు, పన్నీర్ కు విద్యుత్ స్తంభం గుర్తు ఇచ్చింది. అప్పట్నుంచి తమ గుర్తులతో ఇరు వర్గాలు ఆర్కేనగర్లో ప్రచారం చేసుకుంటున్నాయి. పన్నీర్ ఎప్పటిలాగే రూల్స్ ఫాలో అవుతుంటే.. శశికళ బ్యాచ్ మాత్రం తమకు అలవాటైన పనులు చేస్తూ.. ఈసీ దగ్గర బుక్కైపోయింది. పైకి జెండాల్లో టోపీ గుర్తు పెట్టుకుంటూ.. సోషల్ మీడియాలో మాత్రం రెండాకులతోనే ప్రచారం చేస్తుండటాన్ని ఈసీ తప్పుబట్టింది.

తమ దగ్గర అతి తెలివితేటలు చూపించొద్దని దినకరన్ అండ్ కో కు గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. సోషల్ మీడియాతో పాటు ప్రకటనల్లో కూడా రెండాకులు వాడటానికి వీల్లేదని స్పష్టం చేసింది. దీంతో దొడ్డిదారిన లాభపడదామనుకున్న శశికళ వర్గానికి కోలుకోలేని షాక్ తగిలింది. ఇప్పటికే ఆర్కే నగర్లో శశికళ అంటే తీవ్ర వ్యతిరేకత ఉంది. అందుకే ప్రచార సమయంలో శశి పేరు వాడకుండా దినకరన్ జాగ్రత్తపడుతున్నారు. ఇప్పుడు ఈసీ ఇచ్చిన ట్విస్ట్ తో గెలవడం ఇంకా కష్టమౌతుందని శశి టీమ్ లో ఆందోళన కనిపిస్తోంది.

Leave a Reply