బలపరీక్షలో నెగ్గిన పళని…

0
288
Edappadi Palanisamy wins trust vote with 122 MLAs in TN assembly

Posted [relativedate]

Edappadi Palanisamy wins trust vote with 122 MLAs in TN assemblyతమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి బలపరీక్ష సందర్బంగా  డీఎంకే సభ్యులు సృష్టించిన విధ్వంసంతో రెండోసారి వాయిదా పడ్డ  శాసనసభ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. డీఎంకె సభ్యులు బయటకివెళ్లిన తర్వాత స్పీకర్ ధన్ పాల్ ఓటింగ్ నిర్వహించారు. ఉదయం నుండి సజావుగా సాగని   బలపరీక్షలో చివరికి పళని స్వామే  నెగ్గారు. 

 సభకు మొత్తం 230 సభ్యులు హాజరయ్యారు. సభ్యులను మొత్తం ఆరు డివిజన్లుగా విభజించి ఓటింగ్‌ నిర్వహించాలని స్పీకర్‌ నిర్ణయించారు. అయితే  డివిజన్‌ ఓటింగ్‌ను నిరసిస్తూ కాంగ్రెస్‌, ముస్లింలీగ్‌ సభ్యులు కూడా సభనుంచి వాకౌట్‌ చేశారు. అనంతరం  నిర్వహించిన డివిజన్‌ ఓటింగ్‌లో 122 మంది ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయగా, పన్నీర్‌ వర్గానికి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా  ఓటు వేశారు. దీంతో పళనిస్వామి ఓటింగ్‌ లో నెగ్గినట్లు  స్పీకర్‌ వెల్లడించారు. ఈ బలపరీక్షలో సీఎం పళనిస్వామి తన బలాన్ని నిరూపించుకున్నారు. 

పళని స్వామి విజయం సాధించడంతో అసెంబ్లీ బయట పళని  వర్గీయులు సంబరాలు జరుపుకుంటున్నారు. అమ్మ గెలిచిందంటూ నినాదాలు చేస్తున్నారు. 

Leave a Reply