అడ్డంగా పెరిగే కొమ్మ… కొడుకు …

Posted [relativedate]

Mango tree branch cutting for tree growing parents scold son should being good humanసమయం రాత్రి 10 గంటలు !

ఇంటికి ఆలస్యంగా వచ్చిన కొడుకుని చదువు మీద ధ్యాస పెట్టమని , ఇలాంటివి మానుకొమ్మని తల్లిదండ్రులు మందలించారు.”చిన్నప్పటి నుండి చూస్తున్నాను, నాకు మీరు అస్సలు స్వేచ్చ ఇవ్వడం లేదు. ఎంత సేపు చదువు చదువు అని నా ప్రాణం తోడేస్తున్నారు . నేను మిత్రులతో గడపకూడదా ? సినిమాలకి షికార్ల కి వెళ్లకూడదా ? అందరు వెళ్ళడం లేదా ? మొబైల్ లో ఒక గంట సేపు మాట్లాడితే తప్పా ? ఫేస్బుక్ లో చాటింగ్ తప్పా ? ” అని నిలదీసాడు కొడుకు .

“సరే నీకు కావలసినంత స్వేఛ్చ ఇస్తాను. ఒక్క సారి నా మాట వింటావా ? వొచ్చే శుక్రవారం మనం ఒకసారి మన సొంత ఊరికి వెళ్లి వద్దాము . అక్కడ రెండు రోజులు ఉందాము . తిరిగి వొచ్చిన తర్వాత నీ ఇష్టం ” అని తండ్రి బదులిచ్చాడు.కొడుకు సరే అన్నాడు . అనుకున్నట్టు గానే సొంత ఊరికి బయలు దేరారు.తండ్రి కొడుకుతో కలిసి వారి మామిడి తోట కి తీసుకెళ్ళి “నేను ఇక్కడే కుర్చుంటాను . ఈ తోటలో నువ్వు ఒక గంట సేపు తిరిగి రా అని బదులిచ్చాడు”కొడుకు ఒక గంట తర్వాత తిరిగొచ్చాడు.తోటలో నువ్వు ఏమి చూసావు అని ప్రశ్నించాడు తండ్రి.”అన్ని చెట్లు పెద్దగా బాగానే ఉన్నాయి. కానీ ఒక చెట్టు మాత్రం పొట్టిగా, పురుగులు పట్టి, కాయలు లేకుండా ఉంది . ఆరోగ్యం గా లేదు . మిగిలిన అన్ని చెట్లు బాగున్నాయి. దీనికి కారణం ఏమిటి ? ” అని అడిగాడు

దానికి తండ్రి “మామిడి చెట్టు పెంచేటప్పుడు కొంత ఎత్తు పెరిగిన తర్వాత అవసరం లేని కొమ్మలను, కిందకు వేలాడే కొమ్మలను కత్తిరిస్తారు . లేదంటే ఈ వేలాడే కొమ్మలకు సూర్య రశ్మి తగలక, పెరుగుదల ఆగిపోయే అవకాశం ఉంది. అంతే కాకుండా పురుగులు చేరే అవకాశం కూడా ఎక్కువ . అన్ని చెట్లకి కొమ్మలు కత్తిరించాము. అందుకే అన్నీ ఆరోగ్యం గా ఉన్నాయి. కానీ ఆ చెట్టు కి కత్తిరించలేదు. మొదట నాటిన చెట్టు కదా స్వేఛ్చ గా పెరగనిద్దాము అని వదిలేసాము” అని బదులిచ్చాడు.కొడుకుకి విషయం అర్ధమయ్యింది

“అనవసరంగా పెరిగే కొమ్మలు ఎలాగైతే వృక్షాన్ని నాశనం చేస్తాయో .. అదే విధంగా చదువుకునే వయసులో చేసే అనవసరమైన పనులు విద్యార్ధుల జీవితాలను నాశనం చేస్తాయి. మీ నాన్న కేవలం కొమ్మలు కత్తిరించే ప్రయత్నం చేస్తున్నాడు , చెట్టంత కొడుకు చల్లగా ఉండాలని. అంతే కానీ స్వేఛ్చని అడ్డుకోవాలని కాదు ” అని భుజం మీద చెయ్యి వేసి ఇంటికి తీసుకొచ్చాడు .

బిడ్డల భవిష్యత్తు కోసం తపన పడే ప్రతి తల్లి దండ్రుల మనోభావాలను ఈ యువతరం అర్ధంచేసుకోవాలని ఆశిస్తూ………….

భారత్ లో మాత్రమే ఇలా..

Posted [relativedate]

it happens only indiaఇవి ఇండియాకే సాధ్యం.

1.కూతురు చదువుఖర్చు కంటే పెళ్లిఖర్చు ఎక్కువ.

2. పోలీసుని చూస్తే భద్రత కంటే భయం ఎక్కువ

3. సిగ్గు చాలా ఎక్కువ అయినా జనాభా 121 కోట్లు

4. ఫోన్లు పగల కుండా స్క్రీన్ గార్డ్ వాడతారు, తలని కాపాడే హెల్మెట్ పెట్టుకోరు

5 ఆఫీస్ కి అందరు హడావిడి కానీ ఎవడు టైం కి ఆఫీస్ కి రాడు

6. దంగల్ సినిమా లో ఫోగట్ వేషం వేసిన ఆమిర్ ఖాన్ సంపాదించిన సొమ్ము లో ఫోగట్ కుటుంబం వెయ్యవ వంతు వాళ్ళ జీవితం మొత్తం లో సంపాదించ లేదు.

7. అస్సలు పరిచయం లేని వ్యక్తి తో ఆడపిల్ల మాట్లాడ కూడదు కానీ పెళ్లి చేసుకోవచ్చు.

8. గీత గొప్పదా ఖురాన్ గొప్పదా అని కొట్టుకు చచ్చే వాళ్లలో వందమంది లో ఒక్కడు కూడా వాటిని పూర్తి గా చదివి ఉండడు.

9. కాళ్ళకి వేసుకునే చెప్పులు ఏసీ షాప్ లో అమ్ముతారు, అన్నం లో తినే కూరగాయలు కాలువ ప్రక్కన అమ్ముతారు.

10. మేజిక్ ని చేసే బాబా ని నమ్ముతారు కానీ లాజిక్ ని చెప్పే సైంటిస్ట్ ని నమ్మరు.

నిన్ను మించినోడుంటాడు..

Posted [relativedate]

Don't Lose Your Good Relationships With Few People
ఒకసారి తొమ్మిది 8ని లాగి లెంపకాయ వేసింది….
ఏడుస్తూ 8 “నన్నెందుకొట్టావని?” 9ని అడిగింది.
“నువ్వు నాకంటే చిన్న. అందుకే కొట్టా..” అని 9 చెప్పింది.

అది వింటూనే, ఎనిమిది 7ని బలంగా ఒక్కటిచ్చింది. 9 చెప్పిన కారణమే చెప్పుకొంది.

అలాగే
ఏడు 6ని,
ఆరు 5ని,
ఐదు 4ని,
నాలుగు 3ని,
మూడు 2ని,
రెండు 1ని లెంపకాయలు వేశాయి.

1కి క్రింద 0 వుంది. 1మాత్రం అలాచేయక ప్రేమగా 0ని తన పక్కన నిలబెట్టుకుంది. 1 విలువ 10 ఐపోయింది. ఇప్పుడు భయపడడం 9 వంతైంది.
….
….
….
జీవితంలో ఎవరో ఒకరు మన ప్రక్కన నిలబడాలి. (వారెవరన్నది ముఖ్యం కాదు.)
భుజం తట్టి చెయ్యి వేసేవారు వుండాలి.
అనుబంధాన్ని మించిన విలువ జీవితంలో లేదు.
So Don’t Loose Your Good Relationships With Few People.

ఆ అద్దం చూడు …జీవితం నువ్వు చెప్పినట్టే వింటుంది

Posted [relativedate]

see the mirror in your eyes then your life going as you like
ఎప్పటిలాగానే ఆ రోజు కూడా ఉద్యోగులంతా ఆఫీస్ కి వచ్చారు.రావడంతోనే ముఖద్వారం దగ్గర నోటీస్ బోర్డు లో పెద్ద పెద్ద అక్షరాల మీద అందరి దృష్టి పడింది.దాని సారాంశం ఏమిటంటే.. ఈ కంపెనీలో మీ ఎదుగుదలకి అడ్డుగా నిలుస్తున్న ఓ వ్యక్తి చనిపోయారు.అయన శవయాత్రకి మీరంతా హాజరుకావాలని విన్నపం.

అది చదవగానే తమలో ఓ ఉద్యోగి చనిపోయాడని కొందరు బాధపడ్డారు.మరికొందరు ఇన్నాళ్లు ఇతని వల్లే మాకు నష్టం జరిగిందా అని తమలో తామే మాట్లాడుకున్నారు.సరే ఇంతకీ అయన ఎవరో చూసి వద్దాం అని ఒక్కొక్కరిగా అందరూ బయట ఉంచిన శవపేటిక దగ్గరకి చేరుకుంటున్నారు.కానీ అసలు చనిపోయింది ఎవరో ఎవరికీ అర్ధం కాలేదు.దీంతో కుతూహలం ఆపుకోలేని కొందరు ముందుకెళ్లారు.ఒక్కొక్కకరిగా శవపేటిక తెరిచి లోపలి చూశారు..వారికి షాక్ ..లోపలి చూడగానే వారి నోట మాట రాకుండా అయిపోయారు.అలా స్థాణువులా నిలుచుండిపోయిన వారి కళ్ళే భావాలు పలికిస్తున్నాయి.ఇంతకీ శవపేటిక లోపలికి చూసిన వాళ్లంతా అలా ఎందుకయ్యారో తెలుసా?

పేటిక లోపల ఎలాంటి శవం లేదు.కేవలం ఓ పెద్ద అద్దం వుంది.అందులో ఎవరు చూస్తే వాళ్ళ మొహం ప్రతిబింబిస్తోంది.ఆ పక్కనే ఇలా రాసి వుంది ‘ ఈ ప్రపంచంలో మీ ఎదుగుదలకి సంబంధించిన లక్ష్యాలు నిర్దేశించుకునే శక్తిసామర్ధ్యాలు మీ ఒక్కరికే వున్నాయి.మీ సంతోషం,విజయం , తెలుసుకొనే సామర్ధ్యం …వీటన్నిటినీ ప్రభావితం చేసేది మీ ఒక్కరే. బాస్,ఆఫీస్,ఫ్రెండ్స్…ఇవేమి మారినా మీ జీవితం మారదు.మీరు మారినప్పుడు మాత్రమే మీ జీవితం మారుతుంది.నా శక్తిసామర్ధ్యాలు ఇంతే అన్న ఆలోచన ని అధిగమించి చూడండి..మీ జీవితం ఇలా ఉండటానికి మీదే బాధ్యత అని అర్ధమవుతుంది.ఈ నగ్న సత్యాన్ని మీరు అర్ధం చేసుకుంటే …దానికి అనుగుణంగా మార్పు చేసుకుంటే ..మీ జీవితం మారిపోతుంది ‘

ఆ సందేశం చదివాక ప్రతి ఒక్కరు అర్ధం చేసుకోవలసిన విషయం ఒకటుంది. ఓ గుడ్డు ని బయట నుంచి గట్టిగా కొడితే అది పగిలిపోతుంది..అంటే ఓ జీవితం ముగిసిపోయింది.కానీ అదే శక్తి లోపలి నుంచి ఉద్భవిస్తే గుడ్డు పగిలి పిల్ల బయటికి వస్తుంది. ఓ జీవితానికి అంకురార్పణ జరిగింది.ఔను మార్పు రావాలంటే …జీవితం మారిపోవాలంటే మీలో నుంచి మీరు మళ్లీ పుట్టాలి ..సరికొత్తగా మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోవాలి .
* గొప్ప గొప్ప విషయాలెప్పుడూ అంతర శక్తుల నుంచే పుడతాయి.

ఇదంతా చదివాక మీరే చెప్పండి ..ఆ అద్దం చూస్తే …మీలో నుంచి మీరు సరికొత్తగా పుడితే …మీ జీవితం మీరు చెప్పినట్టు వినదా?

గూగుల్ సీఈవో కి ఓ వెయిటర్ చెప్పిన పాఠం …

Posted [relativedate]

otel waiter teaches to google ceo sundar pichaiఒకసారి సుందర్ పిచాయ్ (గుగుల్ ceo)స్నేహితులతో కలిసి ఒక హోటల్ లో కూర్చున్నాడు. ఆ పక్కనే ఇద్దరు అమ్మాయిలు కూడా కూర్చున్నారు. ఎవరి సరదాల్లో వారుండగా ఎక్కడి నుంచో వచ్చిన ఒక బొద్దింక ఆ ఇద్దరు అమ్మాయిల్లో ఒకామె మీదకు ఎగిరింది. అంతే! హోటల్ దద్దరిల్లేలా అరిచి, గోల చేసి, ఎగిరి.. ఎలాగైతేనేం బొద్దింకను విదిల్చి కొట్టింది. అది కాస్తా వెళ్లి రెండో అమ్మాయి మీద పడింది. ఆవిడ కూడా అదే స్థాయిలో గగ్గోలు పెట్టింది. ఆ గందరగోళం లోనే దాన్ని విదిల్చేసరికి అది వెళ్ళి ఒక సర్వర్ మీద పడింది. అతను చాలా ప్రశాంతంగా ఆ బొద్దింకను పట్టుకుని కిటికీ దగ్గరకు వెళ్ళి బయటకు విసిరేశాడు.
ఈ సంఘటన విన్నాక మీకేమనిపించింది? ఒక పది సెకన్లు ఆలోచించి మీకు ఏదో ఒకటి అనిపించాక ఇది చదవండి!

మీలాగే ఈ దృశ్యాన్ని చూసిన సుందర్ పిచాయ్ కు కూడా కొన్ని ఆలోచనలు వచ్చాయి. మనకొచ్చిన ఆలోచనలకు, అతని ఆలోచనలకు తేడా ఏమిటో అతని మాటల్లోనే తెలుసుకుందాం!

కాఫీ తాగుతూ జరిగిందంతా చూసిన నాలో ఆలోచనలు మొదలయ్యాయి. ఈ గందరగోళం అంతటికీ కారణం ఏమిటి? ఆ అమ్మాయిలు అంత హిస్టీరిక్ గా మారిపోడానికి కారణం ఏమిటి? బొద్దింకా? అలా అయితే ఆ సర్వర్ మీద పడింది కూడా అదే బొద్దింక కదా! అతనెందుకు వీళ్ళలా డిస్టర్బ్ కాలేదు?అంటే కారణం బొద్దింక కాదు. బొద్దింక వలన కలిగిన ఇబ్బందిని ఆ ఇద్దరమ్మాయిలూ ఒకలా, అతనొకలా స్వీకరించారు. అప్పుడు నాకర్థమైంది… ఇంట్లో మా నాన్న లేదా ఆఫీసులో బాస్ లేదా భార్య నా మీద అరిచినప్పుడు నాకు కలిగే చిరాకుకు కారణం ఏంటో? దానికి కారణం వాళ్ళ అరుపులు కాదు. వాళ్ళ అరుపుల వల్ల నాలో చిరాకు పుట్టకుండా నన్ను నేను అదుపు చేసుకోలేక పోతున్నాను.

రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయితే నాకు కలిగే అసహనానికి కారణం ట్రాఫిక్ కాదు, అలాంటి పరిస్థితిలో అసహనానికి గురవ్వకుండా నన్ను నేను నియంత్రించుకోలేక పోతున్నానన్న మాట.

సమస్య కంటే ఆ సమస్యకు నేను స్పందిస్తున్న తీరువల్లే జీవితం గందరగోళంగా తయారవుతోంది. బొద్దింక ఘటన వల్ల నాకు అర్థమైంది ఏంటంటే…సమస్యల పట్ల స్పందించడం కన్నా, సమస్యను అధిగమించడం ముఖ్యం. బొద్దింక రూపంలో వచ్చిన సమస్యకు ఆ అమ్మాయిలు అతిగా స్పందించారు. కానీ ఆ సర్వర్ స్పందించకుండా, సమస్యను అధిగమించాడు.

స్పందనలు ఎప్పుడూ ఉద్రేకాలతో కూడుకుని ఉంటాయి. సమస్యను అధిగమించడం అనేది మాత్రం ఆలోచనలతో కూడుకుని ఉంటుంది. ఇది అర్థం చేసుకుంటే జీవితం అందంగా అనిపిస్తుంది.ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నాడంటే కారణం అతని జీవితంలో అన్నీ అతనికి అనుకూలంగా జరిగాయని కాదు. తన జీవితంలో అతనికి ఎదురైన మంచి చెడులన్నిటి పట్లా అతను సరైన వైఖరితో ఉన్నాడని అర్థం.”

సమస్యకు స్పందించే విధానం వల్లే పరిష్కారం లభిస్తుంది.

కర్మసిద్దాంతం.. ఓ కోణం

Posted [relativedate]

all are believe astrology because of knowing future and solve problemsఈ రోజు మనమున్న స్థితికి గతజన్మలో మనం చేసిన కర్మఫలం కారణం. అలాగే ఇవాళ మనం చేసిన కర్మల ఫలితాన్ని రాబోయే జన్మలో మనం అనుభవించక తప్పదు. ఈ విషయాలను మన ఋషులు మనకు ఉపదేసించారు. పాపకృత్యాలే అన్నింటికీ కారణమన్నారు. భగవంతుడు కరుణామయుడు. అదే సమయంలో న్యాయమూర్తి కూడ! మనం చేసిన పుణ్యాలకు మోక్ష ఫలాన్ని అందిస్తూనే, పాపకృత్యాలకు తగిన శిక్షను అమలు చేస్తాడు. ఇది తప్పదు.

ఈ నేపథ్యంలో జ్యోతిశ్శాస్త్రం భవిష్యత్తులో మనకు జరుగబోయే విషయాలను తెలియజేసి, వాటి ప్రభావాన్ని తగ్గించడానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మార్గదర్శకంగా ఉంటుంది. ఒక విపత్తు వస్తుందని ముందుగా తెలిస్తే, దాని నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తాం. కాబట్టి, దాని ప్రభావం తక్కువగా ఉంటుంది. అదే సమయంలో మనకు తెలియకుండా ప్రమాదం జరిగితే, ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జ్యోతిషశాస్త్రం కూడా భవిష్యత్తులో జరుగబోయే సంఘటనల గురించి ముందుగానే చెప్పి, మనం మానసికంగా ఎదుర్కోడానికి తగిన ఉపాయాలను సూచిస్తూ సహాయకారిగా ఉంటుంది. జ్యోతిష శాస్త్రం మనకు మార్గదర్శకమై బాధల నుంది విముక్తి పొందే మార్గాన్ని స ూచిస్తుంది. కర్మ సిద్థాంతం మూడు రకాలైన కర్మలను గురించి చెబుతోంది.

1. ప్రారబ్దకర్మ: గత జన్మలో మనం చేసిన కర్మల ఫలితాన్ని ప్రస్తుతం అనుభవించడాన్ని ప్రారబ్ద కర్మ అంటారు.

2. సంచితకర్మ: గతజన్మలో మిగిలిపోయిన కర్మఫలాలను ప్రస్తుత జన్మలో అనుభవించడం సంచితకర్మ.

3. ఆగామికర్మ: ప్రస్తుతజన్మలో మనం చేస్తున్న కర్మల ఫలాన్ని రాబోయే జన్మలో అనుభవించేదిగా రూపుదిద్దుకోవడాన్ని ఆగామికర్మ అనంటారు.

మానవునికి తాను చేసిన కర్మల ఫలితాన్ని అనుభవించడానికి ఒక జన్మచాలదు. శ్రీకృష్ణ భగవానుడు మానవుడు చేసే ఏ కర్మ అయినా తనకు అంటకుండా, భగవంతునికి సమర్పణ భావంతో చేయాలని, దీనివల్ల మానవునికి తక్కువ జన్మలలో మోక్షప్రాప్తి సుగమమై, జనన మరణ చక్రాల నుంచి తప్పుకోవడం జరుగుతుంది. గత జన్మలో చేసిన పాప కర్మల ఫలితాల ప్రభావాన్ని పూర్తిగా తుడిచి వేయడానికి జ్యోతిష శాస్త్రం, జపం, ధర్మం, హోమం వంటి మార్గాలను సూచించింది. ఈ జన్మలో మనం చేసే మంచి కర్మల ఫలితాలు గత జన్మలో చేసిన పాపకర్మల యొక్క ప్రభావాన్ని తగ్గించి మనిషికి తక్కువ దు:ఖాన్ని కలుగజేస్తుంది. భగవంతుని ప్రగాఢంగా నమ్ముకున్నట్లయితే జ్యోతిష్య శాస్త్ర జ్ఞానం అనాయాసంగా మనిషిని చేరుతుంది.

ఎవరైనా… పరిహార ప్రక్రియలు పాటిస్తే… జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొనే శక్తి పొందగలరు. అందుచేత జయం, దానం, హోమం, శాంతి, దేవాలయ దర్శన, రత్నధా రణ, మొ విషయాలు జ్యోతిష్యంలో చెప్ప బడ్డాయి. ఇవి చేయటానికి ముందు మరికొ న్ని విషయాలు తెలుసుకొని అప్పుడు పాటిస్తే మరింత ఫలితం ఉంటుంది.

‘భా’ అంటే కాంతి, కాంతి విజ్ఞానానికి, ఆనం దానికి, పరమాత్మకు సంకేతం. దాని యందు ‘రతి’ (వీలు) గలవారే భారతీయులు.

కర్మ సిద్ధాంతం అంటే (ఈ జన్మలో కాని, పూర్వజన్మలో కాని తాను చేసిన పనికి ఫలితం తానే అనుభవించాలి అని కొందరి భావన. కాని చేసిన కర్మకు ప్రతిఫలం అనుభవించుట సార్వత్రికంగా నియ మం కాదు. అప్పుచేసిన వాడు తీర్చకపోతే జైలుకు పోవుట కర్మ ఫలితంగా భావిస్తే… ‘తీర్చుట’ అనే ప్రక్రియ జైలుకు పోకుండా కాపాడుతుంది. అనగా పూర్వం చేసిన కర్మకు అనుభవించుటం ఒక మార్గమైతే…

దానిని నిరోధించుట కొరకు మరో కర్మ చేయుట మ రో మార్గం. కాగా జాతకం లో ఉన్నది తప్పక అనుభవించాలి. అనే విధానం మాత్రం సరియైనది కాదు. బృహజ్జాతక వ్యాఖ్యాత భట్టత్పలుడు ‘జాతక ఫలితాన్ని అనుభవించుటే తప్పనిసరి అయితే దానిని తెలుసుకొనుట వ్యర్థం. భావి ఫలితాన్ని ముందుగా తెలుసుకొట వల్ల రాబోయే దుఃఖం కోసం ఇప్పటినుండి దుః ఖించడం అనే నష్టాలుండటం వల్ల జాతక ఫలితం తెలుసుకోవడమే నష్టప్రదం అవుతుం ది. శాస్త్ర ప్రయోజనం అదికాదు. ఒక జాతకంలో శుభ ఫలితాన్ని తెలుసుకొని అనువైన కృషి చేయటం ద్వారా ఫలితాన్ని సంపూర్ణంగా సాధించవచ్చు.

జాతకంలోని దుష్ట ఫలితాన్ని విశ్లేషించి దానాదికములైన పుణ్యకర్మల ద్వారా శుభఫలితాన్ని పెంచుకోవచ్చు. దుష్టఫలితాన్ని ముందుగా తెలుసికొనుట ద్వారా దానికి వ్యతిరేదిశలో ప్రయత్నించి దుష్ట ఫలితాన్ని జయించవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. ఆ దోష ప్రాబల్య శా తాన్ని గమనించి దాన్ని జయించడం సాధ్యం కాని పంలో దానికి సిద్ధపడి తన జీవనగమనంలో అనుగుణమైన మార్పులను చేసుకోవచ్చు’ అని వివరించాడు.

కర్మ ఫలితం వుంటుంది. అది దుష్టమైనదైనపుడు దాని నివారణకు చేసే కర్మకూ ఫలితం ఉంటుంది. కర్మను కర్మచేతనే జయించాలి. పూర్వం చే సిన కర్మను దానివల్ల వచ్చే ఫలితా న్ని అదృష్టమని, దైవికమని పిలుస్తుంటారు. ‘విహన్యాద్ధుర్బలం దైవం పురుషేణ విపశ్చితా’ అనే వ్యాసుని వచనం పూర్వకర్మను ప్రస్తుత కర్మచే జయించవ్చనే అభిప్రాయాన్ని బలపరుస్తున్నది. మనమిదివరలో చేసిన కర్మననుసరించి మ న జననం సంభవిస్తుంది. మన జననం మనచేతిలో లేదు, కాని అప్పటి గ్రహస్థితి పూర్వకర్మకు అనుగుణంగా ఉంటుంది. ఆ గ్రహస్థితి ప్రభావం కాలక్రమంలో దశాక్రమాన్ననుసరించి ఆయా భావనలు ప్రేరేపిస్తుంది.

ప్రేరేపించబడిన భావనకు స్పందించిన వ్యక్తి తన భావాలను అనుసరించి ప్రవర్తించ కుండా శాస్త్రం, సామాజిక న్యాయం, అనుభవం ఆధారంగా చేసుకొని వివేకంతో ప్రవర్తించి మంచి న పెంచుకోవడం, చెడ్డను తొలగించుకోవడం, చేయవలసి వుంటుంది. దోషఫలితం సిద్ధించే సమయాన్ని జాతకం తెలుపుతుంది. దానిని ముందుగా గుర్తించడం ద్వారా దానిని జయిం చే అవకాశాన్ని జాతకం కల్పిస్తుంది. అఘజాతకంలో ‘యదుపచిత మన్య జన్మని శుభ శుభం తస్య కర్మణః పంక్తిం వ్యం జయతి శాస్తక్రులత్‌ తమసి దైవ్య ణి దీపమేవ’ అన్నారు వరాహమిహిరుడు. పూర్వజన్మలో చేసిన శుభాశుభ కర్మల యొక్క ఫలానుభవ కాలాలను ఈ శాస్త్రం సూచిస్తుంది. చీకటిలోని వస్తువులను దీపం సహాయం తో గుర్తించినట్లుగా కలుగబోయే శుభాశుభాలను జాతకం ద్వారా గుర్తించి అనుకూల, వ్యతిరేక ప్రక్రియ ల ద్వారా జీవితాన్ని సుఖవం తం చేసుకొనుటకు ఈ శాస్త్రం సహకరిస్తుంది.
కర్మ 3 విధులు. ప్రారబ్ధం, సంచితం, ఆగామి. ప్రారంబ్ధం అంటే –

పూర్వజన్మలో మనం చేసిన కర్మల ఫలితం అనుభవించడం ప్రారంభించింది. ప్ర – ఆర బ్దం – ఇంతకు ముందే ఆరంభింపబడింది. దానిని జయించ శక్యం కాదు. విడిచిపెట్టిన బాణం యొక్క మార్గాన్ని మళ్ళించ డం అంత సులభం కాదు. సంచితం- సంచితకర్మ అంటే పూర్వం చేయబడిన నిల్వవున్నది. ఆగామి – అంటే రాబోయే కాలంలో పరిపక్వమయ్యేది. మన సత్ప్రవర్తన ద్వారా ఆ గామిని మంచిగా మలచుకోవచ్చు. జాతకం ద్వారా రాబోయే దుష్టఫలితానికి వ్యతిరేకంగా మనం చెయ్యాల్సి న కృషిని అం చనా వేసుకొని ఆధ్యాత్మిక లౌకిక ప్రయత్నాల ద్వారా కృషి చేసి దుష్టఫలితాన్ని అధిగమించవచ్చు. ఉదాహరణకి… నిన్న ఒక వ్యక్తిని మనం కొట్టాం. ఈ రోజు అతను మనల్ని కొట్టడానికి పదిమందిని వెంటవేసుకొనివస్తున్నాడు. ఈ విషయాన్ని ముందుగా తెలుసుకొని మనం అతని చేతిలో దెబ్బలు తినటం తప్పనిసరి అని తెలిస్తే మూడు విధాలుగా దానిని అధిగమించవచ్చు.

ఎ) అతను ఎన్నింటికి వస్తున్నాడో తెలుసుకొని అతను వచ్చే సమయానికి ముందే అతనితో వచ్చే బలగం కాన్నా ఎక్కువ బలగంతో వెళ్ళి ‘క్షమార్పణ’ చెప్పడం ఒక మార్గం. జాతకంలో ఉన్న దుష్టఫలితం యొక్క శాతాన్ని గమనించి దానాదుల ద్వారా దానికన్నా ఎక్కువ పుణ్యాన్ని సంపాదించి గతంలో తాను చేసిన అపరాధాలను క్షమించమని ప్రార్థించేటువంటి ఇది.

బి) ఎదుటివాడు 10 మందితో వస్తే అతన్ని జయించే విధంగా ఇంకా ఎక్కువ బలగంతో వెళ్ళి ఎదురించడం రెండో మార్గం… జాతకంలో దుష్ట సమయాన్ని గుర్తించి లౌకికమైన కృషిని పెంచి దుష్టఫలితాన్ని అధిగమించే ప్రయత్నం చేయడం ఇలాంటిదే.

సి) అతను వచ్చేసమయానికి అతనికి కనిపించకుండా దాక్కోవడం. మనకు జాతకంలో వచ్చే దుష్టసమయాన్ని గుర్తించి నూతన ప్ర యత్నాలు చేయాలి.

  • సిరిపురపు శ్రీధర్ 

ఆ జాడీ.. మీ జీవితం ఒకటే

Posted [relativedate]

Glass jar our life same to sameఓ ఫిలాసఫీ ప్రొఫెసర్ తరగతి బల్ల మీద కొన్ని వస్తువులతో నిలుచుని ఉన్నాడు. విద్యార్థులు మౌనంగా, ఆయన చెప్పేది వినడానికి సిద్ధంగా ఉన్నారు.

కొన్ని క్షణాల తర్వాత, ప్రొఫెసర్ తను తెచ్చిన వస్తువుల్లోంచి ఓ పెద్ద ఖాళీ గాజు జాడీని, కొన్ని గోల్ఫ్ బంతులని బయటకి తీసారు. గోల్ఫ్ బంతులని ఒక్కొక్కటిగా జాడీలోకి జారవిడిచారు. క్లాసంతా నిశ్శబ్దం.
జాడీ నిండిందా అని విద్యార్థులని అడిగారు ప్రొఫెసర్.
పూర్తిగా నిండిందని వాళ్ళు ఒప్పుకున్నారు.

అప్పుడు ప్రొఫెసర్ తను తెచ్చిన గులకరాళ్ళ కవరు విప్పి, వాటిని కూడా జాడీలో జారవిడిచారు. జాడీని కొద్దిగా కదిలించారు. గులక రాళ్ళన్ని గోల్ఫ్ బంతుల మధ్యకి, అట్టడుగుకి చొచ్చుకుపోయాయి.

క్లాసంతా నిశ్శబ్దం.
జాడీ నిండిందా అని విద్యార్థులని అడిగారు ప్రొఫెసర్.
పూర్తిగా నిండిందని వాళ్ళు ఒప్పుకున్నారు.
తర్వాత ప్రొఫెసర్ ఓ పొట్లంలోంచి ఇసుకని తీసి జాడీలో ఒంపారు.అది జాడీలోకి నిరాటంకంగా జారిపోయింది.
క్లాసంతా నిశ్శబ్దం.

జాడీ నిండిందా అని విద్యార్థులని అడిగారు.

“నిండింది” అంటూ విద్యార్థులు ఒకే గొంతుతో అరిచారు.
అప్పుడు ప్రొఫెసర్ అప్పటి దాక మూత పెట్టి ఉన్న రెండు కాఫీ కప్పులని దగ్గరికి తీసుకున్నారు. వాటి మీది మూతలను తీసి, కాఫీని జాడీలోకి వొంపారు. ఇసుక రేణువుల మధ్య ఉందే ఖాళీ స్థలంలోకి కాఫీ సులువుగా జారుకుంది.

ఈ చర్యకి విద్యార్థులు విరగబడి నవ్వారు.
నవ్వులు సర్దుమణిగాకా, ప్రొఫెసర్ ఇలా అన్నారు –
“ఈ జాడీ మీ జీవితాన్ని ప్రతిబింబిస్తోందని గ్రహించండి.
గోల్ఫ్ బంతులు ముఖ్యమైనవి – దేవుడు, కుటుంబం, మీ పిల్లలు, మీ అరోగ్యం, స్నేహితులు, ఇంకా మీకు అత్యంత ప్రీతిపత్రమైన అంశాలు! మీ సిరిసంపదలన్నీ పోయినా, ఇవి మీతో ఉంటే మీ జీవితం పరిపూర్ణంగానే ఉన్నట్లే.

గులక రాళ్ళు – మీ ఉద్యోగం, సొంతిల్లు, కారు వంటివి.
ఇసుక – అన్ని చోట్ల ఉండే చిన్న, చితక విషయాలు.
మీరు జాడీని ముందుగా ఇసుకతో నింపేస్తే, గోల్ఫ్ బంతులకి, గులక రాళ్ళకి అందులో చోటుండదు.
జీవితంలో కూడ ఇంతే -ప్రాధాన్యత లేని చిన్న చిన్న విషయాలకి అత్యంత ప్రాముఖ్యతనిస్తూ, అసలైన, ముఖ్యమైనవాటిని విస్మరిస్తూంటాం.

సంతోషం కలిగించే వాటిపై దృష్టి నిలపండి.
మీ పిల్లలతో ఆడుకోండి.
మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
అప్పుడప్పుడు మీ జీవిత భాగస్వామిని బయట డిన్నర్‌కి తీసుకెళ్ళండి.
మీ 18 ఏళ్ళప్పుడు ఎలా ఉన్నారో, అంతే ఉత్సాహంగా, ఉల్లాసంగా గడపండి.
ఇంటిని శుభ్రం చేసుకోడానికి, నిరుపయోగమైన వాటిని వదుల్చుకోడానికి ఎప్పుడూ సమయం ఉంటుంది.
గోల్ఫ్ బంతుల వంటి ముఖ్యమైన అంశాలపై ముందు దృష్టి పెట్టండి. ప్రాధాన్యతలు నిర్ణయించుకోండి. మిగిలేదంతా ఇసుకే” –

క్లాసంతా నిశ్శబ్దం.
ఇంతలో ఒక కుర్రాడు తనకో సందేహమన్నట్లు చెయ్యెత్తి, “మరి కాఫీ దేనికి ప్రతిరూపం?” అని అడిగాడు.
“శభాష్, ఈ ప్రశ్న అడింగందుకు నాకు సంతోషంగా ఉంది.
“మీ జీవితం దేనితో నిండిపోయినా, మిత్రుడితో ఓ కప్పు కాఫీకి ఎప్పుడు అవకాశం ఉంటుంది” అంటూ ప్రొఫెసర్ క్లాస్ ముగించి వెళ్ళిపోయారు.

సంక్రాతి వస్తోంది …ఆనందం తెస్తోంది.

Posted [relativedate]

sankranthi festival celebrationsసంక్రాంతి పండుగ జనవరి 14 వ తేదిశనివారం వచ్చింది గ్రామీణ ప్రాంతాల్లో ఈ పండుగ మాజా ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు.వరుసగా మూడు రోజులు హాలిడేస్ వచ్చాయి. దీనితో హై టెక్ నగరం కాస్త ఖాళీ అవుతుంది. ప్రత్యేకించి పండుగ ప్రత్యేకతలు నాటికి నేటికి బాగా మారిపోయాయి ఒకప్పుడు .గంగిరెద్దులు, హరిదాసులు ఇలా సందడి సందడిగా ఉండేది.వాటిలో కొన్ని మిస్ అయ్యామనే ఫీలింగ్ వున్నా సూక్ష్మంలో మోక్షంలా గ్రామీణ ప్రాంతాల్లో ఐనా ఇంకా సంప్రదాయం మినుకు మినుకు మంటోందిఅనే తృప్తి వుంది ఇంటి ముంగిట రంగుల ముగ్గులు, మామిడి తోరణాలు, చెరుకు గడలు, పిండివంటలు, సూర్యుడు కి నైవేద్యం చేసిన కొత్త బియ్యపు పొంగలి ఆ మధురానుభూతే వేరులే..

  • బాపు, రమణ వంటి వారు గీసిన చిత్రాలను చూస్తే చాలు పండుగ ఇంట్లో వున్నట్టే ఉంటుంది. మొదటి రోజు ‘భోగి’, రెండవ రోజు ‘మకర సంక్రాంతి ‘ (ఇది అసలైన పండుగ రోజు) మూడవ రోజు ‘కనుమ’, చివరి రోజు లేదా నాల్గవ రోజు ‘ముక్కనుమ’ గా చెపుతారు.

 

  • భోగి రోజున కుటుంబం లోని పెద్దలూ పిల్లలూ అందరూ కలసి ఉదయం వేళ కొయ్య దుంగలతో రోడ్లపై భోగి మంటలు వేస్తారు. తమ తమ ఇండ్లలోని, పనికిరాని పాత చెక్క వస్తువులను, ఇతర వస్తువులను మంటలలో పడవేసి, పనికిరాని పాతకు స్వస్తి చెప్పి కొత్త దనాన్ని కోరతారు.భోగి మంట పాత చెడు అలవాట్లని మాని కొత్త మంచి అలవాట్లని చేసుకోవాలని కూడా సూచిస్తుంది.

 

  • మూడు సంవత్సరాల వయసు లోపు పిల్లలకు ఒక సాయంకాల వేడుకగా రేగిపండ్లు, పూవులు, చిల్లర నాణేలు కలిపి వారి తలపై పోసి ఆనందిస్తారు తల్లి తండ్రులు ,బంధు మిత్రులు దీనినే భోగి పండ్లు పోయటం అంటారు. రుచికరమైన తీపి పదార్థాలు తయారు చేసి అందరికి పంచుతారు. కుటుంబం లోని సభ్యులు ఎవరెవరు ఎక్కడ ఉన్నప్పటికీ, ఈ పండుగనాడు ఒకే చోట కలసి ఆనందిస్తారు. సోదరులు లేదా, తల్లి తండ్రులు, వివాహం అయిన తమ ఇంటి ఆడ పిల్లలని పండుగకు పిలిచి వారికి బట్టలు, ఇతర బహుమానాలు పంచి వారి ప్రేమాప్యాయ తలను చాటుకుంటారు.

 

  • మకర సంక్రాంతి లేదా ‘ పెద్ద పండుగ’. అంటే ఇది పండుగలలో అన్నిటికంటే పెద్ద పండుగ అని అర్ధం. ఈ రోజు అందరూ కొత్త దుస్తులు ధరిస్తారు, దేముని పూజిస్తారు, ఈ రోజున సూర్యుడు మకర రాశి లో ప్రవేశిస్తాడు. కనుక దీనిని మకర సంక్రమణం అని కూడా అంటారు. మరణించిన తమ పూర్వీకులకు సాంప్రదాయకంగా కొన్ని కర్మలను ఆచరిస్తారు. ఇంటిలో తయారు చేసిన పిండి వంటలతో కుటుంబ సభ్యులు అందరూ కలసి భోజనాలు చేస్తారు.

 

  • కనుమ పండుగ రోజున ఆవులను, ఎద్దులను పూజిస్తారు. దీనిని కనుమ పండుగ లేదా పశువుల పండుగ అని కూడా అంటారు. ఈ రోజున ప్రయాణించటం ఆశుభంగా భావిస్తారు. ఈ రకంగా సంక్రాంతి పండుగలో తమ సంప్రదాయ, సాంస్కృతిక విలువలు ప్రదర్శిస్తూ కొత్త మార్పులని ఆచరిస్తారు. గురువులు, తమ శిష్యులను ఆశీర్వదిస్తారు. ఇంటి పెద్ద కుటుంబంలోని సభ్యులకు దుస్తులు అందించి ఆశీర్వదిస్తారు.

 

  • సంక్రాంతి పండుగ నాల్గవ రోజు ను ‘ముక్కనుమ’ అంటారు. సంక్రాంతి పండుగ మొదటి మూడు రోజులు కోస్తా ఆంధ్ర,తెలంగాణ ప్రాంతం లోని ప్రజలు మాంసం లేదా చేపలు వంటి ఆహారాలు తినరు. కాని మూడవ రోజు అయిన కనుమనాడు నాన్ వెజ్ తిని తీరాల్సిందే తెలంగాణా ప్రాంతం లో ఈ పండుగ రెండు రోజులు మాత్రమే చేస్తారు. వీరు మొదటి రోజు నువ్వుల తో కలిపి వండిన అన్నాన్ని తిని, రెండవ రోజు అయిన పండుగనాడు మాంసం తింటారు. ఈ పండుగకు అన్ని కుటుంబాలు అరిసెలు, అప్పాలు వంటి పిండి వంటలు చేసి దేముడికి నైవేద్యం చేసి వారు తింటారు.

కోడి పందేలు …..సంక్రాతి స్పెషల్..

  • కోడి పందేలు, ఆంధ్ర కోస్తా జిల్లాలలో ఫేమస్ తమిళనాడు రాష్ట్రంలో ఎద్దుల పందేలు, కేరళ లో ఏనుగుల మేళా నిర్వహిస్తారు. ఈ పందేలలో చట్టబద్ధం కానప్పటికీ అధిక మొత్తాలలో పందేలు కాయటం ఈ ప్రాంతాలలో ఆనవాయతీగా వస్తోంది.ఈ పండుగ మరో ప్రత్యేకత పండుగ ఇంకా నెల రోజులు వున్నదనగానే, ప్రతి రోజూ ఉదయం వేళ రంగుల దుస్తులు ధరించి హరిదాసులు, గంగిరెద్దులు ప్రతి ఇంటి ముందుకు తెచ్చి ఇంటి వారికి ఆశీర్వాదాలు ఇచ్చి సొమ్ము అడుగుతారు( ఇప్పుడు కనిపిస్తే ప్రపంచ వింత లా హరిదాసుని చూస్తారు )

రంగు రంగుల గాలి పటాలు తమ భావనాలపైకి ఎక్కి ఎగుర వేసి ఆనందిస్తారు.కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలు కూడా ఈ పండుగను పొంగల్ పేరుతో ఆచరిస్తాయి.

చాడీల్ని జల్లెడేసిన చాణుక్యుడు …

 Posted [relativedate]

chanukyudu good words

ఒక సారి చాణిక్యుని దగ్గరకు అతని మిత్రుడు ఒకడు వచ్చి నీకు తెలుసా నీ మిత్రుడు గురించి నేను ఒక విషయం విన్నాను” అని ఎంతో ఉత్సాహంగా ఇంకేదో చెప్పబోతున్న అతన్ని చాణిక్యుడు ఆపి “నీవు నా మిత్రుడు గురించి చెప్పబోయే ముందు ఒక్క నిముషం సావధానంగా నీవు చెప్పబోయే విషయాన్ని కొద్దిగా జల్లెడ పడదాం దీన్ని నేను “మూడు జల్లెడ్ల పరీక్ష (Triple Filter Test)” అంటాను అని అడగటం మొదలు పెట్టాడు.

మొదటి జల్లెడ”నిజం” – “నీవు నా స్నేహితుడి గురించి చెప్పబోయే విషయం ఖచ్చితంగా నిజమైనదని నీకు తెలుసా ?” అని అడిగాడు.

అందుకు ఆ స్నేహితుడు “లేదు, ఎవరో అంటుండగా విన్నాను” అని అన్నాడు.
“అంటే నీవు చెప్పబోయే విషయం నిజమైనదే అని నీకు తెలీదన్న మాట” అని చాణిక్యుడు అన్నాడు.

సరే రెండో జల్లెడ “మంచి ” – ” నీవు నాకు చెప్పబోయే విషయం నా మిత్రుని గురించిన మంచి విషయమా ?” అని అడిగాడు చాణిక్యుడు,

“కాదు” అన్నాడు చాణిక్యుని స్నేహితుడు .

“అంటే నీవు నా మిత్రుని గురించి చెడు చెప్పాలను కున్నావు, అది కుడా నీకు ఖచ్చితంగా నిజమని తెలీని విషయం- సరే ఇంక మూడో జల్లెడకు వెళదాం”అన్నాడు చాణిక్యుడు.

మూడో జల్లెడ “ఉపయోగం” – “నీవు నా మిత్రుని గురించి చెప్పబోయే విషయం నాకు ఉపయోగమైనదా ? “ అని చాణిక్యుడు అడిగాడు.

“లేదు” అన్నాడు ఆ మిత్రుడు.

“అయితే నీవు చెప్పబోయే విషయం నిజమైనది, మంచిది, ఉపయోగకరమైనది కానపుడు నాకు చెప్పటం ఎందుకు ?” అని అన్నాడు చాణిక్యుడు

నీతి : మన గురించి, మన వాళ్ళ గురించి చెడు వార్తలను, విషయాలను మోసే వాళ్ళు చాలా మంది వుంటారు. ఒక విషయం (చాడి) వినేముందు ఈ మూడు జల్లెడల పద్ధతి అనుసరిస్తే, మన బంధాలు నిలబడతాయి, మంచి పెంపొందుతుంది. చాడీలు నివారించబడతాయి.

బిలియన్ తాతకి తెలుగు పేరుంది తెలుసా.?

Posted [relativedate]

 telugu numbers theory names

సంఖ్యామానం:

ఒకటి =1

పది =10

వంద =100

వెయ్యి =1000

పదివేలు =10000.

లక్ష =100000

పదిలక్షలు =1000000

కోటి =10000000

పది కోట్లు= 100000000

శతకోటి =1000000000

సహస్త్ర కోటి =10000000000

అనంతకోటి =100000000000

న్యార్భుద్ధం =1000000000000

ఖర్వం =10000000000000

మహాఖర్వం =100000000000000

పద్మం =1000000000000000

మహాపద్మం =10000000000000000

క్షోణి =100000000000000000

మహాక్షోణి =1000000000000000000

శంఖం =10000000000000000000

మహాశంఖం =100000000000000000000

క్షితి =1000000000000000000000

మహాక్షితి =10000000000000000000000

క్షోబం =100000000000000000000000

మహా క్షోబం =1000000000000000000000000

నిధి =10000000000000000000000000

మహానిధి =100000000000000000000000000

పరాటం =1000000000000000000000000000

పరార్థం =10000000000000000000000000000

అనంతం =100000000000000000000000000000

సాగరం =1000000000000000000000000000000

అవ్యయం =10000000000000000000000000000000

అమృతం =100000000000000000000000000000000

అచింత్యం =1000000000000000000000000000000000

అమేయం =10000000000000000000000000000000000

భూరి =100000000000000000000000000000000000

మహాభూరి =1000000000000000000000000000000000000

మన భారతీయ & హైందవ సాంప్రదాయములో మాత్రమే అంత పెద్ద సంఖ్యలకు కూడా నిర్దిష్టమైన పేర్లు గలవు