ఈడు గోల్డ్ ఎహే మూవీ రివ్యూ….

0
477

Posted [relativedate]

 eedu gold ehe movie review

చిత్రం : ఈడు గోల్డ్ ఎహే (2016)
నటీనటులు : సునీల్, సుష్మా రాజ్, రిచా పనాయ్..
సంగీతం : సాగర్ మహతి
దర్శకత్వం : వీరూ పోట్ల
నిర్మాత : రామ బ్రహ్మం సుంకర
విడుదల తేదీ :  07అక్టోబర్, 2016.

స్టార్ కమెడియన్ కొనసాగుతున్నప్పుడు సునీల్ కి యేడాదికి నాలుగైదు హిట్స్ దక్కేవి. అదే హీరోయ్యాక హిట్ మాటే కరువైంది. అప్పుడేప్పుడో ‘మర్యాద రామన్న’తో సూపర్ హిట్ కొట్టాడు సునీల్. ఆ తర్వాత ఆ రేంజ్ లో హిట్ దక్కడం లేదు. అయినా వరుస సినిమాలతో సునీల్ దండయాత్ర కొనసాగిస్తూనే ఉన్నాడు. సునీల్ తాజా చిత్రం ‘ఈడు గోల్డ్ ఎహే’. సుష్మా రాజ్, రిచా పనాయ్ కథానాయికలు. వీరుపోట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకగా ఈరోజు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి.. ఈ సారైన సునీల్ కి విజయం దక్కుతుందా.. ? అసలు ‘ఈడు గోల్డ్ ఎహే’ కథేంటీ.. ?? అది ప్రేక్షకులని ఏ మేరకు మెప్పించిందో తెలుసుకునేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ..

కథ :
ఓ అనాథ బంగార్రాజు (సునీల్). పెద్దగా లక్ష్యాలేవీ ఉండవు. నచ్చన చోట పనిచేసి.. మెచ్చిన చోట ఉండటమే బంగార్రాజు పని. కాకపోతే.. మనోడిని పనిలో
పెట్టుకొన యజమానికి ఇబ్బందులు తప్పవు. దీంతో.. మనోడిని దగ్గర తీసేందుకు ఎవ్వరు ముందుకు రారు. అలాంటి బంగార్రాజుని జయసుధ చేరదీస్తుంది. ఆ కుటుంబం వ్యాపారాన్నే చూసుకొంటుంటాడు బంగార్రాజు. ఇంతలో ఓ ఇంటర్నేషనల్ క్రిమినల్ మూట మనోడిని వెంటాడుతూ ఉంటుంది. అది మహదేవ్ క్రిమినల్ ముఠా.

ఈ ముఠా గురించి ఆరా తీస్తే బంగార్రాజుకి షాకింగ్ న్యూస్ తెలుస్తోంది. బంగార్రాజుని సునీల్ వర్మ అని భావిస్తున్నారని తెలుస్తోంది. తనలాగే మరొకరు ఉన్నారని. అంటే సునీల్ డబుల్ యాక్షన్.. అసలు రెండో సునీల్ ఎవరు? ఇద్దరికీ లింకేంటి ? ఈ కథలో గీత (సుష్మా రాజ్), రిచా పనాయ్ ఎవరు? చివరికి బంగార్రాజు మహదేవ్ ముఠా ఆటలు కట్టించాడు ?? అనేది మిగితా కథ.

ప్లస్ పాయింట్స్ :
* సునీల్
* కామెడీ
* ట్విస్టులు
* పంచ్ డైలాగ్స్

మైనస్ పాయింట్స్ :
* ఫస్టాఫ్
* ఆకట్టుకొనే స్క్రీన్ప్ ప్లే లేకపోవడం
* విలన్ పాత్ర

నటీనటుల ఫర్ ఫామెన్స్ :
కామెడీ థ్రిల్లర్ కి సరిపడే కథని రాసుకొన్నాడు దర్శకుడు వీరూ పోట్ల. ఒకట్రెండు ట్విస్టులు బాగా ఆకట్టుకొన్నాయి. అయితే, బలమైన స్క్రీన్ ప్లే మిస్సయ్యింది. స్క్రీన్ ప్లే పై ఇంకాస్త దృష్టిసారిస్తే.. ఈడు నిజంగానే గోల్డ్ అయ్యేవాడు ఎహే. సునీల్ కామెడీ, యాక్షన్ సీన్స్ లోనూ మెప్పించాడు. కథకి ఎంత వరకు అవసరమో అంతే చేశాడు. శక లక శంకర్ కామెడీ ఏపీసోడ్ బాగా పేలింది. హీరోయిన్లు సుష్మా రాజ్, రిచా పనాయ్ లు నటనలో పర్వాలేదనిపించినా.. గ్లామర్ తో ఆకట్టుకొన్నారు. విలన్ పాత్రని మరింత బలంగా చూపిస్తే పోరు రసవత్తరంగా సాగేది. కొన్ని కామెడీ ట్రాక్స్ బలవంతంగా ఇరికించినట్టు కబడుతోంది.

సాంకేతికంగా :
దర్శకుడు వీరు పోట్ల కథ బాగుంది. కథనంలోనూ ఆకట్టుకొన్నాడు. కాకపోతే.. ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకొంటే బాగుండేది. కామెడీ ఏపీసోడ్స్, ఒకట్రెండు
ట్విస్టులు ఈ చిత్రానికి ప్రధాన బలం. సాగర్ మహతి అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకొంది. పాటలు మాత్రం అంత గొప్పగా ఏం లేవు. సినిమాటోగ్రఫీ బాగుంది.
ఇంకాస్త కత్తెర పెట్టే సన్నివేశాలు ఉన్నాయి. తెరపై ఈడు గోల్డ్ లానే మెరిశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మొత్తానికి.. సునీల్ బంపర్ హిట్ ముందు ఆగిపోయినట్టు ఉంది.. ఈడు గోల్డ్ ఎహే.

తెలుగు బుల్లెట్ అనాలసిస్ :
కామెడీ థ్రిల్లర్ నడుస్తోన్న ట్రెండ్ ఇది. సునీల్ ట్రెండు తగ్గట్టుగా వచ్చాడు. కామెడీ కూడా వర్కవుట్ అయ్యింది. ఇంకాస్త థ్రిల్ చేసివుంటే బాగుణ్ను. మొత్తానికి ఈడు గోల్డ్ ఎహే అనిపించుకోకున్నా ఈడు రోల్డ్ గోల్డ్ ఎహే మాత్రం అనిపించుకోలేదు. సునీల్ మార్క్ కామెడీ కావాలనుకునే ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసెయొచ్చు.
బాటమ్ లైన్ : ఈడు గోల్డ్ ఎహే..  ఈడు రోల్ గోల్డ్ మాత్రం కాదు..

రేటింగ్ : 2.75/5

Leave a Reply