అంతోటి ఏనుగును ఇంతోటి ఈగ తరిమేస్తుంది …

 eega beat elephant

ఏనుగును ఈగ తరమడం …వినటానికి వింతగా వున్నా ఇది నిజం. అయితే ఆ ఈగ మామూలు ఈగ కాదులెండి.. తేనెటీగ.. మనం చాలా సార్లు ఏనుగులు పంట పొలాల్ని ధ్వంసం చేయడం చూశాము. అయితే వాటిని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక ఇటు రైతులు, అటు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇక ఏనుగు సంతతి విపరీతంగా వుండే ఆఫ్రికా దేశాల్లో పరిస్థితి ఏంటి?
ఆఫ్రికన్ రైతుల కష్టాల్ని తొలగించడానికి ఆక్స్ఫర్డ్ పరిశోధకుడు లూసీ కింగ్.. వినూత్న ప్రయోగం చేశాడు. తేనెటీగల శబ్దం వింటే ఏనుగులు పారిపోవడం గమనించాడు. వాటిని పొలాల ఫెన్సింగ్ లపై ఉండేలా చర్యలు చేపట్టాడు. కెన్యాలో ఈ ప్రయోగాన్ని విజయవంతం చేశాడు.. తక్కువ ఖర్చుతో చేస్తున్న ఈ ప్రయోగం మన రైతులకి కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చిత్తూర్ జిల్లా రైతులకు, ఉత్తరాంధ్ర లోని కొన్ని ప్రాంతాల అన్నదాతలకు మేలు జరుగుతుంది.

SHARE