ఈనాడు కి పెద్ద చిక్కొచ్చి పడింది..

0
853

 eenadu chairman ramoji rao got crucial timeతెలుగు పత్రికారంగంలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా నెంబర్ 1 గా వుంటూ వస్తున్న ఈనాడు కి పెద్ద చిక్కొచ్చి పడింది.అది …ఆంధ్రప్రదేశ్ లో పత్రిక విధివిధానాలు ఎలా వుండాలన్నదానిపై ఈనాడు యాజమాన్యం మల్లగుల్లాలు పడుతోంది.అంతకుముందు కొంత దూకుడుగా వ్యవహరించే ఈనాడు బాణీ ఇప్పటికే చాలా మారింది.2014 తర్వాత ఆంధ్ర,తెలంగాణాలో అధికార పక్షాల ఆలోచనలకి దగ్గరగానే ఈనాడు నడుస్తున్నట్టు కనిపిస్తోంది .ఇక కేంద్రం లోని మోడీ ప్రభుత్వం గురించి వ్యతిరేక వార్తలే కనిపించడంలేదు.చివరికి హోదా అంశం లోనూ ఈనాడు కేంద్రప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తున్నట్టు కనిపించడం లేదు.

పవన్ తిరుపతి సభ తర్వాత ఈనాడుకు గొప్ప చిక్కొచ్చి పడింది.కేంద్రంలో రామోజీకి అపారగౌరవం ఇస్తున్న మోడీ సర్కార్ …రాష్ట్రంలో ఎప్పటినుంచో కలిసి అడుగులేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం..ఇప్పుడు రామోజీతో మంచి సంబంధాలే కొనసాగిస్తున్న పవన్ …ఈ ముగ్గురు ఒక్కసారిగా రాజకీయ చిత్ర పటం మీదకి వచ్చారు.వీరిలో ఎవరినీ వదులుకోలేని పరిస్థితి.ఏ వార్త ఎవరిని నొప్పిస్తుందో ? ఎవరినెలా ఇబ్బంది పెడుతుందో అని యాజమాన్యం ఆందోళన పడుతోంది.మేనేజ్ మెంట్ మనసెరిగి వార్త రాయడం విలేకరులకు కూడా కత్తి మీద సాములా మారింది .

Leave a Reply