ఈనాడు ఆ గజ్జి వదిలిస్తుందా?

 Posted October 20, 2016

eenadu channel special story about caste feeling
జనానికి నచ్చింది చెప్పేవాళ్ళే గానీ ..వాళ్ళకి నిజంగా అవసరమైంది చెప్పే నేత ..చేసే నాయకులూ కరువైన రోజులివి.రాజకీయాలు ఆలా కంపు కొడుతున్నాయిలే అని సరిపెడదామనుకుంటే మీడియా ధోరణులు కూడా ఆటే వెళ్తున్నాయి.జనం ఏది చూస్తే అదే చూపించే రోజులు నడుస్తున్నాయి. ప్రభుత్వాలు మీడియాని పరోక్షంగా నియంత్రించగలుగుతున్నాయి.ఈ పరిస్థితుల్లో యాజమాన్యాలు కూడా ఓ మంచి మాట చెప్పాలనుకుంటే ఒకటికి పది సార్లు ఆలోచించాల్సివస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆంధ్ర ప్రదేశ్ ని పట్టిపీడిస్తున్న కుల కంపు వదిలించడానికి ఈనాడు ఓ ప్రయత్నం చేసింది.

విద్యార్థి దశలోనే యువతీయువకులు ఆ రొంపిలోకి ఎలా దిగుతున్నారో సవివరంగా తెలిపింది.ముఖ్యంగా కృష్ణా,గుంటూరు జిల్లాల్లో వేళ్లూనుకున్న ఈ జాడ్యాన్ని కళ్ళకి కట్టేలా వివరించింది.అయితే ఆ మురికి ఒక కధనం తో పోయేది కాదు. నిరంతర పోరాటం అవసరం.అవగాహన పెంచడం అవసరం.రాజకీయాలు వీటిని పెంచి పోషిస్తాయి..లేదంటే అవసరానికి వాడుకుంటాయి.ఈనాడు లాంటి సంస్థ దీన్నో సామాజిక బాధ్యతగా తీసుకుంటే పూర్తి ఫలితం రాకున్నా ఎంతోకొంత మార్పు వస్తుంది.ఎంత పెద్ద ప్రయాణమైనా తొలి అడుగు తోనే మొదలవుతుంది కదా.ఈనాడు ఆ అడుగు వేసింది.ఇక ప్రయాణం కొనసాగించటమే మిగిలి వుంది. ఈనాడు దెబ్బ కైనా కుల గజ్జి వదిలితే అంతకు మించి కావాల్సింది ఏముంది?

SHARE