ఉచిత ఇసుక పై ‘ఈనాడు’ బాణం..

Posted October 5, 2016

   eenadu epaper told ap sand mafia

ఏపీ సర్కార్ అక్రమాల నివారణకంటూ తలపెట్టిన ఉచిత ఇసుక పధకంలో డొల్లతనాన్ని ఈనాడు ఎత్తిచూపింది.ఉచితంగా ఒక్క బొచ్చె ఇసుక కూడా వినియోగదారులకి చేరడం లేదని కుండబద్ధలు కొట్టింది.ఉచిత ఇసుక పధకం వల్ల ఇటు వినియోగదారులకి ఏ మాత్రం ప్రయోజనం లేకపోగా అటు ప్రభుత్వాదాయానికి భారీగా గండి పడిన విషయాన్ని ..ఇదే ఆసరాగా అక్రమార్కులు,కొందరు ప్రజాప్రతినిధుల జేబులు ఎలా నిండుతున్నాయో వివరించింది.ఏపీ సర్కార్ వైఫల్యాలపై ఈనాడు ఈ స్థాయిలోకధానాలివ్వడం సంచలనం రేపుతోంది.

ఈనాడు వైఖరిని రెండుమూడు కోణాల్లోంచి చూస్తున్నారు రాజకీయవిశ్లేషకులు.
1పథకాల్లో లోపాలు ఎత్తిచూపి సర్కారు ని అప్రమత్తం చేయడం.. లేక ఈ పధకాన్ని ఎత్తివేయడానికి జనాన్ని సిద్ధంచేయడం..
2.అక్రమాలకు పాల్పడి సర్కార్ కి చెడ్డ పేరు తెస్తున్న నాయకుల్ని హెచ్చరించడం .. లేదా అలాంటి కొందరు నాయకులపై చర్యలు తీసుకోడానికి రంగం సిద్ధం చేయడం
ఏదేమైనా ఓ ప్రభుత్వపథకంలో లోపాన్ని ఓ పత్రిక ఎత్తిచూపడం సర్వసాధారణ వ్యవహారం.కానీ దాని గురించి కూడా మాట్లాడుకోవాల్సి రావడం తెలుగు రాష్ట్రాల్లో మీడియా,పాలకుల ధోరణికి అద్దం పడుతోంది.

SHARE