అక్కడ ఆడాళ్ళు మొగుళ్ళని చెప్పులతో ?

0
380

  egypt country   wifes beat husbands
ప్రపంచం మొత్తం మీద మొగుళ్లపై చేయి చేసుకునే ఆడాళ్ళు ఎక్కువ ఎక్కడుంటారో తెలుసా? ఈజిప్ట్ లో …అక్కడ భార్యలు మొగుళ్ళ మీద కోపమొస్తే అరిచి ఊరుకోరు.చెప్పులు,బ్యాగులు ,బెల్టులు …ఒక్కోసారి పదునైన ఆయుధాలు సైతం వాడి వాళ్ళ తోలు తీస్తారు.ఈజిప్ట్ లో దాదాపు 28 శాతం మంది మహిళలు భర్తల పని పట్టేవాళ్లేనట.

వాళ్ళిలా కొట్టడానికి కారణం గురించి ఆ దేశ ఎంపీ ఎల్హామీ ఎజీనా అనే అయన చేసిన సూత్రీకరణ మరీ చిత్రంగా వుంది.ఈజిప్ట్ మహిళలకి సెక్స్ కోరికలు ఎక్కువట.వారి కోరికలు తీర్చడంలో పురుషులు విఫలం కావడం వల్లే వారిని పెళ్ళాలు కొడుతుంటారట.అలివిమాలిన శృంగార వాంఛలు తగ్గించుకోడానికి మర్మాంగాలకి సంబంధించి శస్త్రచికిత్సలు చేయించుకోవాలని కూడా ఆ ఎంపీ మహిళలకి సూచించాడు.అయితే అలాంటి ఆపరేషన్ లని 2008 లోనే ఈజిప్ట్ నిషేదించిన విషయాన్ని ఆ ఎంపీ మరిచిపోయినట్టున్నాడు.ఏమైతేనేమీ ఆయనగారి వ్యాఖ్యలు ఇప్పుడు ఈజిప్ట్ లో చర్చనీయాంశం అయ్యాయి.

Leave a Reply