ఎక్కడికి పోతావు చిన్నివాడా రివ్యూ…

0
659
ekkadiki pothavu chinnavada review

Posted [relativedate]

ekkadiki pothavu chinnavada reviewచిత్రం : ఎక్కడికి పోతావు చిన్నివాడా (2016)
నటీనటులు : నిఖిల్, హెబ్బా పటేల్, నందితా శ్వేతా
సంగీతం : శేఖర్ చంద్ర
దర్శకుడు : విఐ. ఆనంద్
నిర్మాత : పీవీ రావు
రిలీజ్ డేట్ : 18 నవంబర్, 2016.

నిఖిల్ చిత్రాలు విభిన్నంగా ఉంటాయి. ‘స్వామి రారా’తో కథల ఎంపికలో నిఖిల్ టేస్ట్ మారిపోయింది. కార్తికేయ, సూర్య వర్సస్ సూర్య.. లాంటి విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులని మెప్పించాడు నిఖిల్.దీంతో..నిఖిల్ సినిమాలు డిఫరెంట్ గా ఉంటాయనే ముద్రపడిపోయింది.నిఖిల్ తాజా చిత్రం ‘ఎక్కడికిపోతావు చిన్నివాడా’.హారర్ కామెడీతో కూడిన ఫ్యాంటసీ ప్రేమకథా చిత్రమిది. ఐవీ ఆనంద దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నిఖిల్ సరసన హెబ్బా పటేల్, నందితా శ్వేతా జతకట్టారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్స్ కి మంచి స్పందన వచ్చింది. పెద్దనోట్ల రద్దు ఎఫెక్ట్ ని సైతం లెక్క చేయకుండా నిఖిల్ ‘ఎక్కడికిపోతావు చిన్నివాడా’ ఈరోజు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరీ.. ఈ చిత్రం ప్రేక్షకులని ఏ మేరకు మెప్పించింది.. ? ఇంతకీ చిన్నివాడి కథేంటో తెలుసుకునేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ..

కథ :
రాజమౌళి ‘బాహుబలి’ చిత్రానికి గ్రాఫిక్ డిజైనర్ గా పనిచేస్తుంటాడు అర్జున్ (నిఖిల్). సరదా కుర్రోడు. మనోడికి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే. నిత్యా (హెబ్బా పటేల్)తో పరిచయం కాస్త.. కొన్నాళ్లకి ప్రేమ మారుతోంది. ఈ జంట తెజ ఎంజాయ్ చేస్తుంటుంది. ఇదిలా సాగుతుండగానే.. మరో అమ్మాయి అమల (నందితా శ్వేతా) నిఖిల్ ని గాడంగా ప్రేమిస్తోంది. అతన్నే పెళ్లి చేసుకోవాలని ఫిక్సవుతుంది. తన ప్రేమని అర్జున్ కి చెబుతామనుకొన్న టైంలోనే.. చనిపోతుంది. అదెలా అన్నది సినిమాలో చూడాల్సిందే. చనిపోయిన అమల ఆత్మగా మారి.. అర్జున్ వెంటపడుతోంది. అప్పటి వరకు సరదా సాగిన అర్జున్ లైఫ్ లో కష్టాలు మొదలవుతాయి. చివరికి ఆత్మ నుంచి నిఖిల్ ఎలా తప్పించుకొన్నాడు. ఈ క్రమంలో అతడు ఎదురుకొన్న సమస్యలేంటి.. ? తదిత అంశాలని తెరపై థ్రిల్లింగ్ చూపించడమే మిగితా కథ.

నిఖిల్ సినిమా అంటే కాస్త కొత్తదనం కోరుకుంటారు ప్రేక్షకులు. ఇప్పటికే నిఖిల్ సినిమాలు విభిన్నంగా ఉంటాయనే ముద్రపడిపోయింది. ‘ఎక్కడికి పోతావు చిన్నివాడా’ కూడా డిఫరెంట్ స్టోరీ. ఫస్టాఫ్ అంతా రొమాంటిక్, కాస్త సస్పెన్స్ గా సాగింది. సెకాంఢాప్ లో మాత్రం ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో గ్రిప్పింగ్ గా సాగింది. ఇంటర్వెల్ బ్యాంగ్, అవికాగోర్ ఎంట్రీ, వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకి హైలైట్ నిలిచాయి.

ప్లస్ పాయింట్ :
* కథ – స్క్రీన్ ప్లే
* నిఖిల్
* కామెడీ
* సంగీతం
మైనస్ పాయింట్స్ :
* స్లో నేరేషన్
* క్లైమాక్స్ ఇంకాస్త స్ట్రాంగ్ గా ఉంటే బాగుండేది

నటీనటుల ఫర్ ఫామెన్స్ :
దర్శకుడు ఐవీ ఆనంద్ రాత-తీత రెండూ బాగున్నాయి. కథకి తగ్గట్టుగా నటీటుల ఎంపిక చాలా బాగుంది.లీడ్ రోల్ పోషించిన అఖిల్, హెబ్బా పటేల్,నందితా శ్వేతా సూపర్బ్ గా నటించారు. ముఖ్యంగా నందితా నటన చాలా బాగుంది. ఈమె తెలుగులో మరిన్ని సినిమాలు చేయడం ఖాయంగా కనిపిస్తుంది.నిఖిల్ ఎప్పటిలాగే చాలా బాగా  నటించాడు. స్మార్ట్ గా కనిపిస్తూనే నటనతో ఆకట్టుకొన్నాడు. అవికా గోర్ ఎంట్రీ ప్రేక్షకులని థ్రిల్ చేసింది.వెన్నెల కిషోర్ కామెడీ బాగా పడింది. మిగితా నటీనటులు తమ తమ పరిథి మేరకు నటించారు.

సాంకేతికంగా :
సినిమా ఫస్టాఫ్ రొమాంటిక్ సీన్స్ తో సరదా సాగింది. అయితే, సెకాంఢాప్ ని నిలబెట్టింది మాత్రం స్క్రీన్ ప్లే. సాయి శ్రీరామ్ అందించిన స్క్రీన్ ప్లే చాలా బాగుంది. శేఖర్ చంద్ర అందించిన పాటలు, నేపథ్య సంగీతం రెండూ బాగున్నాయి. ఎడిటింగ్ ఓకే. అయితే, దర్శకుడు ఐవీ ఆనంద్ క్లైమాక్స్ ని ఇంకాస్త బలంగా రాసుకొంటే బాగుణ్ను అనే టాక్ వినిపిస్తోంది.నిర్మాణ విలువలు బాగున్నాయి. తెరపై చిన్నివాడి గ్రాండ్ లుక్ తో కనిపిస్తున్నాడు.

తెలుగు బుల్లెట్ అనాలసిస్ :
నిఖిల్ సినిమాలు డిఫరెంట్ గా ఉంటాయన్న ముద్రపడిపోయింది. ఈ చిత్రం కూడా కాస్త కొత్తగా ఉంది. దానికి సూపర్భ్ స్ర్కీన్ ప్లే తోడైంది. ఆత్మ, దానికి తాలుకు చెప్పే కొన్ని అంశాలు కూడా ఆసక్తిగా ఉంటాయి. పెద్దనోట్ల ఎఫెక్ట్ తో సినిమాలేవీ రాని వేళలో నిఖిల్ ధైర్ఘ్యం చేసి వచ్చాడు. మీకు ఏమాత్రం చిల్లర దొరికినా..ఈ సినిమా చూసేయండీ.. !

బాటమ్ లైన్ : ఎక్కడికి పోతావు చిన్నివాడా.. నవ్వించి.. థ్రిల్ కి గురి చేశాడు!
రేటింగ్ :3/5

Leave a Reply