శశికళ కి పార్టీపదవి కూడా ఊడుతుందా?

0
251
election commission send notices to sasikala so sasikala general secretary post may be gone

Posted [relativedate]

election commission send notices to sasikala so sasikala general secretary post may be gone
సీఎం పీఠం ముంగిట బోల్తాపడ్డ శశికళకి వరసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.పన్నీర్ సెల్వం తిరుగుబాటు షాక్ నుంచి కోలుకోకముందే ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది.తాజాగా ఇచ్చిన నోటీసులోఈసీ కీలక అభ్యంతరాలు లేవనెత్తింది.పార్టీ నియమావళిలో లేని తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవిని ఎలా చేపడతారని ఆ నోటీసులో ప్రశ్నించింది.ఆ పదవిని ఎలా గుర్తించమంటారని నిలదీసింది.ఈసీ ఇచ్చిన షాక్ తో ముఖ్యమంత్రి పదవి మాట అటుంచి వున్న పార్టీ పదవికి కూడా ఎసరు వచ్చింది.తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశి డిసెంబర్ లో ఎన్నిక కావడం వెనుక పెద్ద తతంగమే నడిచింది.

అన్నాడీఎంకే రాజ్యాంగం ప్రకారం వరసగా ఐదేళ్లు పార్టీలో వున్నవారికి మాత్రమే ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టే అవకాశం ఉంటుంది.అయితే ఓ సారి తన మీద కుట్ర చేశారన్న ఆరోపణల మీద ఓ సారి జయ శశికళ కుటుంబాన్ని పార్టీ నుంచి,పోయెస్ గార్డెన్ నుంచి బయటకు పంపింది.మళ్లీ ఆమెకి పార్టీలోకి,పోయెస్ గార్డెన్ లోకి ప్రవేశం దొరికినా నాడు జయ తీసుకున్న బహిష్కరణ నిర్ణయం నేడు శశికి గుదిబండగా మారింది.వరసగా ఐదేళ్లు పార్టీలో ఉండాలన్న నిబంధనలో శశికళ కి అర్హత లేకుండా పోవడంతో ఇప్పుడు పార్టీ పగ్గాలు కూడా జారిపోయే ప్రమాదం పొంచి వుంది.ఆ నిబంధన ధైర్యం తోటే పన్నీర్ తనని పార్టీ కోశాధికారి బాధ్యతల నుంచి శశికళ తొలిగించలేరని ధీమాగా వున్నారు.ఏదేమైనా పైకి లేదు లేదంటూనే రాజ్యాంగపరమైన వ్యవస్థలన్నిటినీ శశికి వ్యతిరేకంగా ప్రయోగించడంలో మోడీ సర్కార్ సక్సెస్ అవుతోంది.ఈ రాజకీయాన్ని ఎదుర్కోవడం శశికి అసలు సిసలు సవాల్.

Leave a Reply