మాజీ ఎంపీని కొట్టిన వ్యాపారి…

115

Posted November 30, 2016, 5:27 pm

jangareddyరాజకీయం మీద వ్యాపార వేత్తలు స్వారీ చేస్తారని అంటూ వుంటాముగానీ దానికి ప్రత్యక్ష సాక్ష్యం కనిపించడం బహు అరుదు.కానీ ఇప్పుడు సోషల్ మీడియా లో కనిపిస్తున్న ఓ వీడియో ఆ స్టేట్ మెంట్ ఎంత నిజమో చెప్తుంది.డబ్బున్నోడికి సామాన్యుడైనా..రాజకీయ నాయకుడైనా ఒక్కటేనని తెలుస్తుంది.బీజేపీ మాజీ ఎంపీ సోదరుడికి ఓ వ్యాపారితో ఆర్ధిక సంబంధమైన విబేధాలొచ్చాయి.దానికి సంబంధించి పంచాయతీ జరుగుతుండగా మాజీ ఎంపీని సదరు వ్యాపారవేత్త చెంప చెళ్లుమనిపించడం…మాజీ ఎంపీ ఆ వ్యాపారిని క్షమాపణ కోరడం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో లీక్ అయిన వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.ముందుగా జంగారెడ్డి అనుచరులు దురుసుగా ప్రవర్తించడం వాళ్ల వ్యాపారి ప్రతీకారం తీర్చుకున్నాడన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.అందుకే ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారని కూడా తెలుస్తోంది.కారణమేదైనా ఓ మాజీ ఎంపీని వ్యాపారి కొట్టడం కొట్టేసేంత చిన్న విషయం కాదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here