జగన్ కు హ్యాండిచ్చిన ఉద్యోగులు!!

Posted February 14, 2017

employees gave hand to jagan
ప్రత్యేక హోదా పోరులో ఉద్యోగులను భాగస్వాములను చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో లాగా ఉద్యోగులు కూడా హోదాపోరులో కలిసి రావాలని కోరుకుంటున్నారు. కానీ అది సాధ్యమయ్యే అవకాశం కనిపించడం లేదు. స్వయంగా ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు అధికారికంగా ఇలా చెప్పేశారు.

ప్రత్యేక హోదా పోరులో పాల్గొనలేమని అశోక్ స్పష్టం చేశారు. ఈ ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోరాడితే మద్దతిస్తామని చెప్పుకొచ్చారు. పార్టీలు విడివిడిగా ఉద్యమం చేయకుండా… అందరూ కలిసి ఢిల్లీ వెళ్లి ఉద్యమం చేయాలని కోరారు. అశోక్ బాబు మాటలతో జగన్ డల్ అయిపోయారట.

హోదా పోరులో ఉద్యోగులు కలిసి వస్తే.. పాలన కొంత గాడి తప్పేలా చేద్దామని ప్లాన్ చేశారట జగన్. ప్రస్తుతం ఏపీలో ఉద్యోగుల పాత్ర కీలకంగా మారింది. ముఖ్యంగా అమరావతి లాంటి ప్రాంతంలో ఉద్యోగులు పని ఒత్తిడిలోనూ కష్టపడి పనిచేస్తున్నారు. చంద్రబాబు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడుతున్నారు. అయితే చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు ఉద్యోగులను కూడా పోరు పోరు పేరుతో బయటకు తీసుకొచ్చేందుకు జగన్ పావులు కదిపారట. అయితే అది కుదరదని ఆదిలోనే ఉద్యోగసంఘాలు తేల్చిచెప్పాయట. ఎందుకంటే సమైక్యాంధ్ర ఉద్యమంలో జగన్ ఏవిధంగా డబుల్ గేమ్ ఆడాలో… ఉద్యోగ సంఘాల నాయకులకు ఇంకా గుర్తుందట. ముందు తమను ఉంచి… జగన్ ఎదిగే ప్రయత్నం చేస్తారని ఎంప్లాయిస్ అనుకుంటున్నారు. అందుకే ప్రజా సమస్యలను గాలికొదిలేసి రాజకీయ ఉద్యమంలో భాగస్వాములు కాలేమని క్లియర్ సిగ్నల్ ఇచ్చేశాయి.

ముందు అశోక్ బాబు కూడా జగన్ వర్గం నుంచి వచ్చిన ప్రతిపాదనలపై ఆలోచించారట. కానీ ఉద్యోగసంఘాలు ససేమిరా అని చెప్పడంతో ఆయన దీన్ని వ్యతిరేకించిక తప్పలేదు. మొత్తానికి జగన్ కు ఉద్యోగులు హ్యాండ్ ఇవ్వడం పెద్ద లాస్ అని వైసీపీ నాయకులు అంటున్నారు. ఇక హోదాపోరులో వెంట నడిచేది ఎవరో తెలియక వైసీపీ అధినేత తికమక పడుతున్నారట. ఇలా అయితే జగన్ కు కష్టమేనని ఆ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎవరి మద్దతు లేకపోతే… హోదా పోరుపై కేంద్రాన్ని నిలదీసేంత దమ్ము…. ధైర్యం… జగన్ కు ఉన్నాయని ఎవరూ అనుకోవడం లేదు!!!

SHARE