జీతాలు భారీగా పెంచిన బాస్‌కు ఆయన డ్రీమ్‌కారును బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచారు గ్రావిటీ సంస్థ ఉద్యోగులు. తన సంస్థలో పనిచేస్తున్న 120 మంది ఉద్యోగుల జీతాలను ఈ మధ్యే భారీ పెంచారు సంస్థ యజమాని డాన్ ప్రైస్. కంపెనీలో పనిచేసే ఉద్యోగి ఏడాది కనీస వేతనం సుమారు రూ.47 లక్షలు గా నిర్ణయించారు. కొందరి జీతాలనైతే ఏకంగా రెట్టింపు చేశారు. అదే సమయంలో ఏడాదికి 11 లక్షల డాలర్లుగా ఉన్న తన జీతాన్ని కూడా 70 వేల డాలర్లకు కుదించుకున్నారు.దీంతో ఉబ్బితబ్బిబ్బైన ఉద్యోగులు ఎన్నో నెలలుగా తాము జమ చేసుకున్న సొమ్ముతో ఖరీదైన టెస్లా కారును ప్రైస్‌కు గిఫ్ట్‌గా ఇచ్చారు. దీని ఖరీదు కనీసం 50 లక్షలు ఉంటుంది. ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ చూసి తెగ మురిసిపోయారు డాన్ ప్రైస్. ఇది నమ్మశక్యంగా లేదని, తన ఉద్యోగులు ఇలా తన డ్రీమ్ కారును గిఫ్ట్‌గా ఇస్తారని ఎప్పుడూ ఊహించలేదని ప్రైస్ తన ఎఫ్బీ అకౌంట్లో పోస్ట్ చేశారు. వారికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదన్నారు.