ఇంజనీరింగ్ కాలేజీల వ్యాపారం

0
521

engineering1
తెలుగు రాష్ట్రాల్లో మెడికల్, ఇంజినీరింగ్ మేనేజ్ మెంట్ సీట్ల అమ్మకం వ్యాపారంగా మారిందన్నారు విద్యార్థి సంఘం నేతలు. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా సీట్లు అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో బి కేటగిరి, ఎన్నారై సీట్ల భర్తీపై విద్యార్ధి సంఘం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. విద్యార్థి సంఘాలతో పాటు విద్యావేత్తలు, ప్రైవేట్ ఇంజినీరింగ్ ఫ్యాకల్టీ అసోసియేషన్స్ , ప్రజా సంఘాలు హాజరయ్యాయి.

కన్వీనర్ కోటా కింద 70శాతం సీట్లను ఆన్ లైన్ ద్వారా భర్తీ చేస్తున్న ప్రభుత్వం… మేనేజ్ మెంట్ కోటా కింద ఉన్న 30శాతం సీట్లను ఎందుకు భర్తీ చేయలేకపోతోందని ప్రశ్నించారు విద్యార్థి నేతలు. ప్రైవేట్ యాజమాన్యాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజాసంఘాల నేతలు. కోర్సులకున్న డిమాండ్ బట్టి లక్షల్లో వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

దీంతో మెరిట్ విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారన్నారన్నారు. ఎంసెట్ నిర్వహించకముందే సీట్లు అమ్ముకోవడం దారుణమని ఫైరయ్యారు.సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జులై 31లోపు కన్వీనర్ కోటా కింద సీట్లను భర్తీ చేసి… ఆగష్టు ఒకటి నుంచి తరగతులు ప్రారంభించాల్సి ఉంది. దీంతో కన్వీనర్ కోటా కింద మిగిలిన సీట్లను కూడా యాజమాన్యాలే అమ్ముకుంటున్నాయని ఆరోపిస్తున్నారు ప్రజాసంఘాల నేతలు.

Leave a Reply