ఇంజనీరింగ్‌ పని అయిపోయిందా..?

0
540

engineering demand over

నవ్యాంధ్రలో ఇంజనీరింగ్ కోర్సుల పట్ల విద్యార్ధుల ఆసక్తి తగ్గిపోతోంది. ఇతర రాష్ట్రాల్లో చదివేందుకు ఇష్టపడుతున్నారు. కృష్ణా జిల్లా ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలు గత ఏడాది కంటే భారీగా తగ్గా యి. తొలి కౌన్సెలింగ్‌లో కృష్ణా జిల్లాలో సుమారు రెండు వేల వరకూ ప్రవేశాలు తగ్గిపోయాయి. కౌన్సెలింగ్‌ను గత ఏడాది కంటే ముందుగానే నిర్వ హించినప్పటికీ ప్రవేశాలు తగ్గిపోవడంతో ఏం జరిగిందో తెలియక కళాశాలల యాజమాన్యాలు అయోమయంలో పడ్డాయి. కృష్ణా జిల్లాలో 34 ఇంజినీరింగ్ కళాశాలలు ఉండగా వాటిలో 12,500 సీట్లున్నాయి. వీటిలో తొలి కౌన్సె లింగ్‌లో ఎనిమిది వేలు మాత్రమే నిండాయి. మరో నాలుగు వేలు మిగిలి పోయాయి. గత ఏడాది పది వేలు నింగా రెండు వేలు మిగిలాయి. గుంటూ రులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 44 కళాశాలలు ఉండగా 18వేల సీట్లు ఉన్నా యి. వీటిలో ప్రస్తుతం 11 వేలు నిండాయి. ఏడు వేల వరకూ మిగిలిపో యాయి. గత ఏడాది 14వేల సీట్లు నిండాయి.
మెకానికల్‌కు తగ్గిన డిమాండ్

గత 20ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఇరు జిల్లాల్లోనూ ఈసారి మెకానికల్‌కు డిమాండ్ భారీగా తగ్గిపోయింది. విద్యార్థులంతా సీఎస్ఈ పైనే దృష్టిపెట్టారు. లేకుంటే ఈసీఈకి ప్రాధాన్యం ఇచ్చారు. సాఫ్ట్‌వేర్ రంగానికి ఈ ప్రాంతంలో భారీగా అవకాశాలు పెరగనున్నాయనే భావనతో పాటు ఏ గ్రూప్ చదివినా సాఫ్ట్ వేర్ వైపు రావాలనే ఆలోచన సైతం దీనికి కారణంగా కన్పిస్తోందని ఇంజినీరింగ్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పుడు ఇంజినీరింగ్‌లో చేరితే నాలుగేళ్ల తర్వాత పట్టా తీసుకుని బయటకు వస్తారు. అప్పటికల్లా ఈ ప్రాంతంలో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవచ్చేనేది ఎక్కువ మంది ఆలోచన.
వందలోపు సీట్లు నిండినవే ఎక్కువ

కృష్ణా జిల్లాలోని 34 కళాశాలల్లో కేవలం ఆరు కళాశాలల్లోనే వంద శాతం సీట్లు నిండాయి. ఏటా కనీసం ఎనిమిది కళాశాలల్లో పూర్తిగా నిండేవి.. ఈసారి సివిల్, మెకానికల్, ట్రిపుల్ఈ గ్రూపుల్లో భారీగా సీట్లు ఉండిపోయాయి. ఒక్కో కళాశాలలో 400 నుంచి వెయ్యి సీట్ల వరకూ ఉండగా 16 కళాశాలల్లో సగం సీట్లే నిండాయి. వంద సీట్ల కంటే తక్కువ నిండినవి 12 వరకూ ఉన్నాయి. రాష్ట్రంలోని ప్రధానభాగం కళాశాలలు కృష్ణా-గుంటూరు జిల్లాల్లోనే ఉన్నాయి. ఇక్కడే ఇలా ఉంటే ఇతర జిల్లాల్లో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రధానంగా విద్యార్థులు రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల కంటే తమిళనా డు, కర్ణాటక రాష్ట్రాల వైపు మొగ్గుచూపడమూ దీనికి ఓ కారణమని కళాశాలల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. అమరావతి పరిధిలోని డీమ్డ్ విశ్వవి ద్యాలయాల్లో సీట్లు ఈ ఏడాది పెంచడం కూడా ఇతర ఇంజినీరింగ్ కళాశా లలకు గండికొట్టిందని పేర్కొంటున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే ఏడాది నుంచి మరో నాలుగు విశ్వవిద్యాలయాలు వస్తే పరిస్థితి మరింత దిగజా రనుందని ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు అంటున్నాయి.

Leave a Reply