రాష్ట్రాలను లైట్ తీసుకుంటున్న కేంద్రం

149
etela rajender comments on modi about on GST bill

Posted June 5, 2017, 11:44 am at 11:44

ఒకే దేశం.. ఒకే పన్ను. ఇదే జీఎస్టీ. పేరుకు మాత్రం అన్ని రాష్ట్రాలతో చర్చలు జరుపుతున్నట్లు పోజులు. కానీ లోపల జరిగేది మాత్రం మోడీ మనసులో ఉన్నది అరుణ్ జైట్లీ ద్వారా అమలైపోతోంది. మరి రాష్ట్రాలకు పిలవడం ఎందుకంటే.. జస్ట్ బ్యాండ్ బాజా బారాత్ కే. జీఎస్టీ సమావేశాలు జరుగుతున్న తీరుపై తెలంగాణ మంత్రి ఈటెల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే అందుకు నిదర్శనం. అసలు రాష్ట్రాలు ఏం చెబుతున్నాయో వినే ఓపిక కూడా కేంద్రానికి లేదన్నది ఆయన అభియోగం.

ఎంతసేపటికీ జీఎస్టీతో వచ్చే పేరు కొట్టేయాలనే తపనే కానీ.. నిజంగా జనానికి ఏది అవసరం, ఏది అనవసరం అని చూడాల్సిన బాధ్యత నుంచి కేంద్రం తప్పుకుంటోంది. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో వస్తువు అవసరం అవుతుంది. మరి అన్ని వస్తువుల్ని ఒకే పన్ను శ్లాబులో చేరిస్తే ఆ వస్తువులు వాడే రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది కలగడం ఖాయం. బీడీలు హానికరం కాబట్టి ఎక్కువ పన్ను రేటులో పెట్టారు. కానీ బీడీలే జీవనాధారంగా బతుకున్న వేలాది మంది కార్మికుల్ని గాలికొదిలేశారు. ఈ సంగతి ఈటెల చెప్పినా వినలేదట.

చాలావరకు జీఎస్టీలో మంచి అంశాలే ఉన్నాయని, కానీ ఇలాంటి చిన్న విషయాలే.. రేపు పెద్దవౌతాయనేది ఈటెల ఆందోళన. జీవనోపాధి మీద దెబ్బకొట్టే నిర్ణయాలను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే అనవసర అపోహలు, భయాలే తర్వాత ఉద్యమరూపం సంతరించుకుంటాయన్న విషయం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఈటెలకు బాగా తెలుసు. ఈ విషయంలో జైట్లీకి నచ్చజెప్పాలని ప్రయత్నించినా ఫలితం కనిపించలేదట. మరి ప్రస్తుతానికి ఈటెల మాత్రమే బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసినా.. రేపు జీఎస్టీ అమల్లోకి వచ్చాక.. ఇంకెంతమంది ఏమంటారోనని విమర్శకులు ఎదురుచూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here