స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ విలీనంను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఎస్బీహెచ్ తెలంగాణ బ్యాంక్ అని చెప్పారు.నిజాం పాలనలో కూడా బ్యాంకు కార్యకలాపాలు జరిగాయని ఆయన గుర్తుచేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ ఎస్బీఐలోకి విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ కేరళ ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసినట్లుగా గుర్తు చేశారుస్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బిహెచ్)ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ)లో విలీనం చేయాలనే ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. .
1956 కంటే ముందు నుంచి ఈ బ్యాంకు ఉందని గుర్తుచేశారు. తెలంగాణ ఐకాన్‌గా ఉన్న ఈ బ్యాంకును ఎస్బిఐలో విలీనం చేయడాన్ని వ్యతిరేకించే విషయమై ముఖ్యమంత్రితో చర్చించనున్నట్లు చెప్పారు. అసెంబ్లీలో ఈ మేరకు ఒక తీర్మానం చేసే విషయమై కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఈటెల అన్నారు. కాగా, ఇప్పటికే ఎస్బిఐలో ఎస్‌బిహెచ్ విలీనంపై కేంద్రం ఆమోద ముద్రవేసింది.