Posted [relativedate]
లక్ష్మీపార్వతి చెప్పినట్టు చేయడం వల్లే ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా తెలుగు దేశంలో ముసలం పుట్టిందా?ఈ వాదనలో నిజం లేదంటున్నారు సీనియర్ రాజకీయ నాయకుడు దాడి వీరభద్రరావు. ఎన్టీఆర్ ఓ నిర్ణయం తీసుకున్నాక లక్ష్మీపార్వతి చెప్పడం వల్ల దాన్ని మార్చుకున్న సందర్భాలు లేవని దాడి అంటున్నారు.ఒక్కో సారి ఆమె అభిప్రాయానికి భిన్నంగా తాము చెప్పిన మాటని ఎన్టీఆర్ అంగీకరించడం చూశానని అయన తెలిపారు.
ఏదేమైనా దాడి పుస్తకంతో మళ్లీ పాత విషయాలన్నీ బయటకు రాబోతున్నాయి.అయితే దాడి ప్రస్తుత వైఖరి చూస్తుంటే ఇటు ఎన్టీఆర్ అభిమానులకి ..అటు చంద్రబాబు అనుచరులకు కోపం రాకుండా జాగ్రత్త పడుతున్నట్టుంది.పుస్తకం పూర్తిస్థాయిలో బయటికి వస్తే గానీ షాక్ లు ఎవరికో..షేక్ లు ఎవరికో అర్ధమయ్యేది.