పాత నోట్లున్నాయా.. ఇలా చేయండి…

0
433
exchange-notes-follow-procedure
Posted [relativedate]exchange-notes-follow-procedure
నోట్లు మార్చుకోవాలంటే..
 •  నవంబరు 10 నుంచి 24 తేదీ వరకు రోజుకు రూ.4వేల వరకు మీ పాత నోట్లు ఇచ్చి కొత్తవి మార్చుకోవచ్చు
 •  రూ.4వేల కన్న ఎక్కువ మార్చుకోవాలంటే 25 నుంచి డిసెంబరు 30 వరకు అవకాశం
 •  కచ్చితంగా గుర్తింపు చూపించే నోట్లు మార్చుకోవాలి.. ఆధార్‌, ఓటర్‌ ఐడీ, రేషన్‌కార్డు, పాస్‌పోర్టు, పాన్‌ కార్డు వంటి చూపాలి
 •  ఎక్కడ మార్చుకోవచ్చు…
 •  అన్ని బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లోనూ మార్చుకోవచ్చు.. అక్కడ మనకు ఖాతా ఉన్నా లేకున్నా మార్చుకోవచ్చు…
   డిపాజిట్‌ చేయాలంటే..
  exchange-notes-follow-procedure
 •  నవంబరు 10 నుంచి డిసెంబరు 30 వరకు బ్యాంకు, పోస్టాఫీసు ఖాతాల్లో డిపాజిట్‌ చేసుకోవచ్చు.. ఎంతైనా డిపాజిట్‌ చేసుకోవచ్చు.. దానికి లిమిట్‌ లేదు.
 •  దీనికి గుర్తింపు ప్రత్యేకంగా చూపించాల్సిన అవసరం లేదు
 •  డిసెంబర్‌31నుంచి మార్చి 31 వరకు నోట్లు డిపాజిట్‌ చేయాలంటే ఆర్బీఐ స్పెసిఫైడ్‌ కార్యాలయాల్లో మార్చుకోవాలి..
 •  దీనికి ఐడీ ఫ్రూఫ్‌, పాన్‌ తప్పని సరిగా సమర్పించాలి.. దీనితోపాటు డిక్లరేషన్‌ ఫామ్‌ జతచేయాల్సి ఉంటుంది
   నగదు తీసుకోవాలంటే..(విత్‌డ్రాలు)
 •  మన ఖాతాల్లో డబ్బులు తీసుకోవాలంటే తప్పకుండా కొత్త నోట్లే ఇస్తారు
  exchange-notes-follow-procedure
 •  మన ఖాతా ఉన్న బ్యాంకు, పోస్టాఫీసుల్లో డబ్బులు తీసుకోవాలంటే నవంబరు10 నుంచి నేరుగ వెళ్లి తీసుకోవచ్చు. కాని రోజుకు కేవలం రూ.10వేలు  ఇస్తారు.. అదే వారంలో అయితే రూ.20వేల వరకు లిమిట్‌ ఉంటుంది.
 •  నవంబరు10 నుంచి నవంబరు 18 వరకు ఏటిఎంల నుంచి రోజుకు కేవలం రూ.2000వేలు మాత్రమే తీసుకోవచ్చు
 •  నవంబరు 19 నుంచి రోజుకు రూ.4000వేల వరకు అవకాశం ఉంటుంది
   ఆన్‌లైన్‌ పరిస్థితేంటి..
 •  షాపింగ్‌ – డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా ఎంతైనా షాపింగ్‌ చేసుకోవచ్చు. దానికేమీ లిమిట్‌ లేదు
 •  ట్రాన్సఫర్‌ – ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు సొమ్ములు మార్చుకోవడానికి ఇప్పటి వరకు ఎలా జరుగుతుందో అలాగే చేసుకోవచ్చు.. ఈ అంశంలో  ఎటువంటి మార్పులుచేయలేదు.

Leave a Reply