మందు కొట్టిన పైలట్లు….

 failets  drunk drive

సాధారణంగా ఎవరైనా మందుకొట్టి బైక్ నడుపుతారు. కారు నడుపుతారు. కానీ ఇద్దరు పైలట్లు మాత్రం మందుకొట్టి విమానం నడిపారు. దీంతో సస్పెన్షన్ కు గురయ్యారు. ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్ వేస్ కు చెందిన ఇద్దరు పైలట్లు మందుకొట్టి దొరికిపోయారు. అంతర్జాతీయ సర్వీసుల్లో పనిచేస్తున్న ఇద్దర్నీ నాలుగేళ్లపాటు సస్పెండ్ చేసినట్లు సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ తెలిపారు. వీరితో పాటు ఎయిర్ ఇండియాకు చెందిన క్యాబిన్ సిబ్బందిని కూడా సస్పెండ్ చేసారు.

ఈనెల 3న అబుదాబి నుంచి చెన్నై వచ్చిన విమాన సిబ్బందిని పరీక్షించగా ఓ పైలట్ మందుకొట్టినట్లు తేలింది. అలాగే ఆగస్ట్ 10న షార్జా నుంచి కాలికట్ వచ్చిన ఫ్లైట్ సిబ్బందికి బ్రీథ్ ఎనలైజర్ టెస్ట్ చేయగా పైలట్ తాగినట్లు తేలింది. దీంతో డీజీసీఏ వారిని సస్పెండ్ చేసింది. జెట్ ఎయిర్ వేస్ సంస్థ కూడా పైలట్ ను విధుల నుంచి తప్పించినట్లు తెలిపింది.

మామూలుగా ఏయితే విమానం బయలుదేరే ముందు పైలట్లకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తారు. ఈసారి విమానాలు ల్యాండ్ అయిన తర్వాత కూడా టెస్ట్ చేశారు. ఈ ఇద్దరు పైలట్లు గతంలో కూడా మద్యం తాగి అధికారులకు దొరికిపోయారు.

SHARE