కుటుంబం ఫ్రూట్ మార్కెట్ .?

140

Posted May 25, 2017, 1:50 pm at 13:50

family relationship like a fruit marketఅరటిపండును తొక్క తీసి తింటాం. సపోటాను తొక్క తీసినా గింజ ఊస్తాం. మామిడి పండును పైది తిని, లోపలది విసిరేస్తాం. సీతాఫలం మద్యలో ఉన్న గుజ్జు తింటాం, పై తొక్కు, లోపల గింజలు వదిలేస్తాం. యాపిల్, జామ పళ్ళని మొత్తం తినేస్తాం.

ఇలాగ మనం ఒక పండు లో టెంక, ఒకదాన్లో గింజ, ఇంకోదాన్లో తోలు, మరొక దాన్లో తొక్క కాదనుకుంటాం. ఒక్కోటి ఒక్కో రుచి. తీపి, పులుపు, వగరు కొంచెం తేడాలతో ఎన్నో రుచులు. అన్ని ఇష్టమే, ఏది తిన్నా మనకు ఆరోగ్యమే.

అయితే పళ్ళు తింటున్నప్పుడు మంచి మాత్రమే గుర్తుంటుంది కాని చెడు గుర్తుండదు.మనకి కావాల్సింది తీసుకోని అక్కర్లేనిది పారేస్తామంతే.అలాగే మనుషులు కూడా పళ్ళ లాంటివారే.

కుటుంబంలోని భార్య భర్త , అమ్మ నాన్న, అక్క చెల్లి, అన్న తమ్ముడు, అందరు ఒక్కొరకం పండు, ఒక్కొక్కరిది ఒక్కో స్వభావం. అయితే అందరు పళ్ళ లాగా మనకు మంచి చేసేవాళ్ళే. కాని మనిషి విషయంలో వాళ్ళు చేసిన మంచి కంటే, వాళ్ళు చూపించిన కోపమో చిరాకో ఎక్కువ గుర్తుంటుంది.పండులో అక్కర్లేని గింజ కూడా ఒక భాగమే అనుకుంటాం కానీ ద్వేషించం. పండులాగే కోపతాపాలు, ప్రేమపాశాలు కలిస్తేనే మనిషి స్వభావం. ఇది గుర్తించగలిగితే, వాళ్ళని ద్వేషించకుండా ప్రేమిస్తాం. కుటుంబం అనేది ” ఏ మిక్సిడ్ భ్యాగ్ ఆఫ్ ఫ్రూట్స్ “

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here