అఖిలేశ్ కు పిచ్కెక్కిస్తున్న కుటుంబం!!!

Posted February 1, 2017

family showing torture to akhilesh
స‌మాజ్ వాదీలో ఏం జ‌రుగుతుందో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. మాటిమాటికి అల‌క‌లు అంతలోనే బుజ్జ‌గింపులు… తేరుకునేలోపు మ‌ళ్లీ సీన్ రివర్స్.. ముఖ్యంగా ములాయం సింగ్ యాద‌వ్, ఆయ‌న త‌మ్ముడు శివ‌పాల్ యాద‌వ్… అఖిలేవ్ స‌హ‌నానికి ప‌రీక్ష పెడుతున్నారు. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న త‌రుణంలో… ప్ర‌తిప‌క్షాల కంటే ఎక్కువ టెన్ష‌న్ పెడుతున్నారు.

ఒక‌వైపు తండ్రి ములాయం… కాంగ్రెస్ తో పొత్తును వ్య‌తిరేకిస్తున్నారు. మ‌రోవైపేమో బాబాయ్ శివ‌పాల్ కొత్త పార్టీ పెడ‌తాన‌ని ప్ర‌క‌టించారు. అయితే ఆయ‌న ఎస్పీ అభ్యర్థిగా నామినేష‌న్ వేసి… ఎన్నిక‌ల త‌ర్వాత కొత్త పార్టీ పెడ‌తాన‌ని చెప్పారు. పార్టీ పెడితే ఇదే టైమ్ లో పెట్టాలి గానీ.. ఎన్నిక‌ల త‌ర్వాత పార్టీ పెట్ట‌డమేంటో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు.

ఈ ప‌రిణామాల‌తో అఖిలేశ్ అయితే త‌ల‌ప‌ట్టుకుంటున్నార‌ట‌. ఒకే ఒక్క‌డుగా పార్టీని ముందుకు తీసుకెళ్తుంటే.. ములాయం, శివ‌పాల్ స‌హాయ నిరాక‌ర‌ణ చేస్తూ… పార్టీని డ్యామేజ్ చేస్తున్నారు. దీనికి తోడు కొత్త పార్టీ అంటూ విప‌క్షాల‌కు ఆయుధాల‌ను అంద‌జేస్తున్నారు. స‌ర్వేల్లో ఎస్పీకి సానుకూల ఫ‌లితాలే ఉన్న‌ప్ప‌టికీ …. ములాయం, శివ‌పాల్ చ‌ర్య‌ల‌తో ఆ ఫ‌లితాలు తిర‌గ‌బెట్టే ప్ర‌మాద‌ముంద‌ని ఆయ‌న ఆందోళ‌న చెందుతున్నారు. అందుకే ఇక అఖిలేశ్ ఇక ఏం జ‌రిగినా లెక్క‌చేయ‌కుండా ముందుకెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. ఎలాగైనా బీజేపీని దెబ్బ‌కొట్టేందుకు కాంగ్రెస్ నేత‌ల‌తో క‌లిసి గ్రౌండ్ వ‌ర్క్ చేస్తున్నార‌ట‌. పార్టీ శ్రేణుల‌కు కూడా త‌న కుటుంబంలోని విష‌యాల‌ను ప‌ట్టించుకోవ‌ద్ద‌ని చెబుతున్నార‌ట‌. అయితే అఖిలేశ్ ఎంత చెప్పినా…. ఈ విష‌యాలతో ఎస్పీకి ఎంతో కొంత డ్యామేజ్ త‌ప్ప‌ద‌న్న వాద‌న వినిపిస్తోంది.

SHARE