అభిమానంతో ఆమెతో బాత్‌రూంలోకి కూడా వెళ్లాడు

0
602
fan irritating esha gupta for a selfie in dubai

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

fan irritating esha gupta for a selfie in dubai
సినిమా స్టార్స్‌ మరియు రాజకీయ నాయకులకు బయటకు వెళ్లాలి అంటే ప్రశాంతత ఉండదు. వారి అభిమానులు ఎక్కడికి వెళ్లినా కూడా ప్రశాంతత ఉండకుండా చేస్తారు. ముఖ్యంగా సినిమా సెలబ్రెటీలు ఎక్కడ కనిపించినా వారి చుట్టు జనాలు గుమ్మి గూడటం చాలా కామన్‌. అప్పట్లో ఆటోగ్రాఫ్‌ అంటూ వెంట పడితే ఇప్పుడు ఒక సెల్ఫీ అంటూ వెంటబడుతున్న విషయం తెల్సిందే. తాజాగా బాలీవుడ్‌ నటి, మాజీ మిస్‌ ఇండియా ఇషా గుప్తకు ఒక అభిమాని కారణంగా చేదు అనుభవం ఎదురైంది.

మాజీ మిస్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ అయిన ఇషా గుప్త సినిమాలతో పాటు ఫ్యాషన్‌ షోల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. తాజాగా దుబాయిలోని ఒక ఫ్యాషన్‌ షోలో పాల్గొనేందుకు వెళ్లిన ఇషాను ఒక అభిమాని సెల్ఫీ అంటూ వేదించాడు. తన ఫ్యాషన్‌ షోను ముగించుకుని తన రూపం వద్ద ఉన్న బాత్‌ రూంకు వెళ్లేందుకు ఇషా ప్రయత్నించిన సమయంలో ఆమె వెనుక ఒక అభిమాని పరిగెడుతూ వెళ్లి సెల్ఫీ కావాలంటూ అడిగాడట. ఇది బాత్‌ రూం, ఇలా ఇక్కడకు కూడా వచ్చి సెల్ఫీ అడగటం ఏంటని ఇషా ఆగ్రహం వ్యక్తం చేసినా కూడా ఒక్క నిమిషం అంటూ అతడు ఆమె సహనాన్ని పరీక్షించాడు. దాంతో ఆమె సెక్యూరిటీ సిబ్బందిని పిలిపించి బయటకు పంపించింది. అభిమానానికి కూడా హద్దు ఉండాలి అంటారు ఇందుకే.

Leave a Reply