Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నాలుగు సంవత్సరాల కష్ట ఫలితం ‘బాహుబలి’ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఇందులో దర్శకుడు ఇతరుల పాత్ర లేదు అని అయితే చెప్పలేం. ఖచ్చితంగా అందరి కష్టం ‘బాహుబలి’లో ఉంది. ఆ కారణంగానే ‘బాహుబలి’ అంత పెద్ద సక్సెస్‌ను సాధించింది. బాహుబలి సక్సెస్ తర్వాత ప్రభాస్ బాలీవుడ్ స్టార్ హీరోల సరసన నిల్చున్నాడు. అయితే ఆ విషయాన్ని బాలీవుడ్ స్టార్స్ ఒప్పుకునేందుకు సిద్దంగా లేరు. ఒక్క సినిమాతో ఒక సౌత్ హీరో బాలీవుడ్ స్టార్ హీరోల స్థాయికి చేరడం ఏంటని, అంత సీన్ లేదు అంటూ కొందరు ఆడి పోసుకుంటున్నారు.
తాజాగా బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ రోహిత్ శెట్టి మాట్లాడుతూ ‘బాహుబలి’ విజయం ప్రభాస్ది కాదని, ఆ సినిమా స్క్రిప్ట్ మరియు దర్శకుడిదని చెప్పుకొచ్చాడు. ప్రభాస్‌కు ఆ సినిమా క్రెడిట్ దక్కదని ఆయన అభిప్రాయం. అయితే ఏ సినిమా సక్సెస్ అయినా కూడా అది స్క్రిప్ట్ మరియు దర్శకుడికే చెందాలి. కాని బాలీవుడ్లో ఒక సినిమా సక్సెస్ అయితే స్టార్ హీరోలను నెత్తిన ఎత్తుకుని మరీ ఉరేగుతారు. కాని ఒక సౌత్ హీరో సినిమా సక్సెస్ అయితే మాత్రం అది దర్శకుడి సక్సెస్ అని లేదా స్క్రిప్ట్ గొప్పదనం అని ఎందుకు ఆడిపోసుకుంటారు అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘బాహుబలి’ సక్సెస్ క్రెడిట్ ఖచ్చితంగా రాజమౌళితో పాటు ప్రభాస్‌కు కూడా దక్కి తీరుతుందని, ప్రభాస్ కష్ట ఫలితం బాహుబలి సక్సెస్ అని ఫ్యాన్స్ అంటున్నారు. బాలీవుడ్ స్టార్స్ అక్కస్సుతో ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని ఫ్యాన్స్ ఎద్దేవ చేస్తున్నారు.