Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అల్లు అర్జున్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డీజే’ చిత్రంలోని గుడిలో బడిలో.. అనే పాట ఇటీవలే విడుదలైన విషయం తెల్సిందే. ఆ పాట వీడియో యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. సౌత్ ఇండియాలోనే అత్యధిక వ్యూస్‌ను దక్కించుకున్న పాటగా ఆ పాట నిలిచింది. అంతే స్థాయిలో ఆ పాటపై విమర్శలు వచ్చాయి. ఆ పాటలోని కొన్ని పదాలు బ్రహ్మణ మనోభావాలను దెబ్బ తీసేలా ఉన్నాయంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
హరీష్ శంకర్ స్పందిస్తూ తాను ఒక బ్రహ్మణుడిని అని, ఎక్కడ కూడా బ్రహ్మణులను అవమానపర్చేలా తాను వ్యవహరించను, ఆ పదాలను కూడా గౌరవ సూచకంగానే తీసుకున్నట్లుగా హరీష్ శంకర్ చెప్పుకొచ్చాడు. అయినా కూడా అయ్యవార్లు ఏమాత్రం తగ్గలేదు. ఆ పాటను తప్పించాల్సిందే అని, ఆ పాటలోని పదాలను తొలగించాల్సిందే అంటూ డిమాండ్స్ చేశారు. దాంతో తప్పని సరి పరిస్థితుల్లో ‘డీజే’ చిత్ర యూనిట్ సభ్యులు ఆ పాటలోని సదరు పదాలను తొలగించనున్నట్లుగా ప్రకటించారు. సినిమాలో వచ్చే పాటలో ఆ పదాలు ఉండవని క్లారిటీ ఇచ్చారు. అలాగే సినిమాలో కూడా ఎలాంటి అయ్యగార్లకు అభ్యంతరకర పదాలు, సీన్స్ ఉండవని చిత్ర యూనిట్ సభ్యులు చెప్పుకొచ్చాడు. ఈనెల చివరి వారంలో ‘డీజే’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.