యంగ్ టైగర్ అతన్ని ఫైనల్ చేశాడా..!

0
182

Posted [relativedate]

ntr1యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు తన తర్వాత సినిమా కథా చర్చల్లో బిజీగా ఉన్నాడు. పూరి గగ్గర నుండి త్రివిక్రం దాకా ఏ ఒక్కరిని వదలకుండా చర్చలు జరుపుతున్న తారక్ కు అనీల్ రావిపూడి చెప్పిన కథ తెగ నచ్చేసిందట. పటాస్, సుప్రీం సినిమాలతో తన సత్తా చాటుకున్న అనీల్ టాలెంట్ మెచ్చిన జూనియర్ ఇప్పుడు తనకు లక్కీ ఛాన్స్ ఇవ్వబోతున్నాడట.

మరి రెండు సినిమాల అనుభవం ఉన్న ఈ కుర్ర డైరక్టర్ ఎన్టీఆర్ ను ఎలా చూపిస్తాడో తెలియదు కాని తారక్ మాత్రం తన దర్శకుడు ఫిక్స్ అని సన్నిహితులతో చెబుతున్నాడట. కమర్షియల్ సినిమాలనే ఎంటర్టైనింగ్ బాటలో చెబుతున్న అనీల్ పనితనం మెచ్చిన తారక్ ఈ అవకాశం ఇస్తున్నట్టు తెలుస్తుంది. దిల్ రాజు ఈ సినిమా నిర్మించే అవకాశాలు ఉన్నయట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.

Leave a Reply