ఎన్టీఆర్ ఫైనల్ ఆప్షన్ వారిద్దరే..!

0
614

Posted [relativedate]

Finally Ntr Select Two Directors For His Nextయంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తర్వాత సినిమా విషయంలో ఓ క్లారిటీకి వచ్చినట్టు కనబడుతుంది. జనతా గ్యారేజ్ హిట్ తర్వాత రాబోయే సినిమాలు కూడా అదే రేంజ్ హిట్ సాధించాలనే ఉద్దేశంతో కథల చర్చలు జరిపిన తారక్ ఇప్పుడు ఓ ఇద్దరిని ఫైనల్ చేసినట్టు ఫిల్మ్ నగర్ టాక్. అందులో ఒకరు కుర్ర డైరక్టర్ అనీల్ రావిపూడి కాగా మరొకరు వి.వి.వినాయక్ అని తెలుస్తుంది.

అనీల్ రావిపూడి ఇప్పటికే జూనియర్ కు కథ చెప్పగా ఆ కథ వద్దనేశాడట. అయితే మరో అద్భుతమైన కథ ఉందని అది చెప్పాలనే ఆలోచనలో ఉన్నాడట. ఇక వినాయక్ తో అదుర్స్-2 ప్లానింగ్ లో కూడా ఉన్నాడు తారక్. ఇప్పటికే తన డైరక్షన్ టీం కు వినాయక్ ఆ సినిమాకు సంబందించిన సీన్స్ రాయమన్నట్టు టాక్. సో ఫైనల్ గా తారక్ ఈ ఇద్దరికి ఫిక్స్ అయ్యాడన్నమాట.

ఒకవేళ ఇద్దరి తనని సాటిస్ఫై చేసే కథ చెప్తే ఇద్దరితో వరుస సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇక మరో పక్క తారక్ తో సినిమాకు తమిళ దర్శకులు వెంటపడుతున్నారు. బాల, హరి లాంటి టాప్ కోలీవుడ్ డైరక్టర్స్ కూడా తారక్ తో సినిమా కోసం ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం వారితో అయితే చర్చలు జరుపుతున్నాడని తెలుస్తుంది.

Leave a Reply