Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రజ్యోతే కార్యాలయంలో ఈరోజు భారీ అగ్నిప్రమాదం జరిగింది.హైదరాబాద్,జూబిలీ హిల్స్ ,జర్నలిస్ట్ కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగివుంటుందని భావిస్తున్నారు. ముందుగా రెండో అంతస్తు నుంచి మొదలైన మంటలు మూడు,నాలుగు అంతస్తులకి కూడా ఎగబాకాయి.అగ్నిమాపక దళం దాదాపు రెండు మూడు గంటల నుంచి మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నా పెద్దగా ఫలితం కనిపించలేదు.బిల్డింగ్ లో చాలా వరకు కాలిపోయింది.అయితే పక్క భవనాలకు ఈ మంటలు అంటుకోకుండా అదుపు చేయగలిగారు.మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో సిబ్బంది బయటకి రావడం కూడా కష్టమైంది.అగ్నిమాపక సిబ్బంది తెచ్చిన నిచ్చెనల సాయంతో వారిని క్షేమంగా కిందకు తీసుకరాగలిగారు.ఎవరికీ ఎలాంటి ప్రాణ ప్రమాదం జరగలేదు.