ఇక ఎఫ్ ఎం రేడియో తరహాలో స్థానిక చానల్స్- పార్ట్ 2

0
975

 

ప్రైవేటు పరం చేయాలన్న ఆలోచన వెనుక…

దేశంలో టెరెస్ట్రియల్ ప్రసారాలు చూసేవాళ్ళ సంఖ్య ఐదు శాతం మించటంలేదని ప్రభుత్వానికి తెలుసు. కేబుల్ ద్వారా చూసేవాళ్ళే 95% ఉన్నారని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. అయినా సరే ప్రభుత్వం  ఆ ఐదు శాతం కోసమే నాణ్యమైన ప్రసారాలు అందించటానికి ట్రాన్స్ మిటర్లను డిజిటైజ్ చేయటం మొదలుపెట్టింది. ఇందుకోసం వేలకోట్లు ఖర్చు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ భారీ మొత్తానికి తగిన ప్రతిఫలం రాబట్టటానికి టెరెస్ట్రియల్ ప్రసారాలలోకి ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఆహ్వానించటం ఒక్కటే మార్గమని ట్రాయ్ భావిస్తోంది.

జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో 300 నుంచి 400 డిటిటి ట్రాన్స్ మిటర్లు ఏర్పాటు చేయటానికి దాదాపు 3 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ప్రసార భారతి అంచనా వేసింది. 630 చోట్ల ఒక్కో ట్రాన్స్ మిటర్ సాయంతో పూర్తి డిజిటైజేషన్ నెట్ వర్క్ ఏర్పాటుచేసుకోవటానికి చాలా ఎక్కువ ఖర్చవుతుంది. ప్రభుత్వమే అంత పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చటం పెనుభారమవుతుంది. పైగా, అలా భారీగా ఖర్చు చేస్తున్నప్పుడు ప్రభుత్వం ఆ చర్యకు సమాధానం కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. కేవలం ఐదు శాతం మందికి డిజిటల్ ప్రసారాలు అందించటానికి ఖర్చు చేయటం వలన అదనపు ప్రయోజనాలేమీ ఉండవనే విమర్శ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకో విషయమేంటంటే, అనలాగ్ లోనే  టెరెస్ట్రియల్ ప్రసారాలకు ప్రైవేట్ భాగస్వాములను ప్రోత్సహించిన దేశాల్లో డిజిటైజేషన్ సైతం ప్రోత్సాహకరంగా ఉంటున్న విషయాన్ని ట్రాయ్ గుర్తుచేసింది.

అయితే, ప్రైవేటు రంగానికి అవకాశమివ్వటం ద్వారా స్థానిక అంశాలమీద ప్రసారాలలో వైవిధ్యం కనబడుతుంది. అందులో వైరుధ్యాలు ఉండే అవకాశమూ ఉంది. స్థానిక కార్యక్రమాల ప్రసారాలకు ప్రాధాన్యం పెరుగుతుంది. ఎక్కువ శాతం ఉచిత చానల్స్ ఉంటాయి కాబట్టి చందా కట్టాలసిన అవసరముండదు. అయితే, అదే సమయంలో స్థానిక ప్రకటనలకు సరైన వేదిక లభిస్తుంది. ఈ పరిస్థితి స్థానికంగా ఉండే ఎమ్మెస్వోలకు ఇబ్బందికరంగా తయారవుతుంది. వాళ్ళు ప్రసారం చేసే చానల్స్ లో ప్రకటనలకు డిమాండ్ తగ్గిపోయి ఆదాయం పడిపోవచ్చు. ఒకరకంగా చెప్పాలంటే దీనివలన ఎమ్మెస్వోల చానల్స్ ఇరకాటంలో పడతాయి. ఇప్పటికే డిజిటైజేషన్ తరువాత హక్కులు లేని సినిమాల ప్రసారం చేసే అవకాశం లేకపోగా వీటితో పోటీపడి ప్రసారాలు అందించాలంటే చాలా సమస్యలొస్తాయి.

అయితే, ప్రేక్షకుల దృష్టికోణంలో చూసినప్పుడు వాళ్ళకు ఎక్కువ చానల్స్ చూసే అవకాశం ఏర్పడుతుంది. అంటే, ఎంచుకునే స్వేచ్ఛ పెరుగుతుంది. పైగా మరికొన్ని వాల్యూ యాడెడ్ సర్వీసులు కూడా అందుతాయి. రేడియోలో ప్రైవేట్ సంస్థలు ప్రవేశించిన తరువాత ఎఫ్ ఎం రేడియో రంగంలో ఎన్ని మార్పులు వచ్చాయో టీవీ విషయంలోనూ అంతే జరుగుతుందని ట్రాయ్ అంచనా వేస్తోంది. ఎదుగుదల కూడా అలాగే ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కేబుల్ రంగం ఇప్పటికే ప్రైవేట్ రంగం చేతుల్లో అపరిమితంగా విస్తరించగా ఎఫ్ ఎం విప్లవంతో రేడియో మళ్ళీ పునరుత్తేజం పొంది మారుమూల ప్రాంతాలకూ చేరుకోవటాన్ని ట్రాయ్ ఈ చర్చా పత్రంలో ప్రస్తావించింది.

ప్రపంచవ్యాప్తంగా కూడా అనలాగ్ లోనే ప్రైవేట్ ఆపరేటర్లు ప్రవేశించగా, డిజిటల్ టెరెస్ట్రియల్ ట్రాన్స్ మిషన్ మొదలయ్యాక మరింతమందికి అవకాశం లభించింది.  ఇతరదేశాల్లో కూడా ప్రభుత్వ రంగ ప్రసార సంస్థలతోబాటే ప్రైవేట్ సంస్థల ప్రసారాలు కూడా ప్రజలకు ఏకకాలంలో అందుబాటులోకి వస్తున్నాయి. అందుకే భారతదేశంలో  ప్రైవేటు రంగంలో కేబుల్, శాటిలైట్ ప్రసారాలు పెరిగినట్టే ఇకమీదట డిటిటి కూడా అభివృద్ధి చెందగలదని ట్రాయ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

టెరెస్ట్రియల్ టీవీ ప్రసారాలలో ప్రైవేటు రంగాన్ని అనుమతించటం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయని ట్రాయ్ భావిస్తోంది.

  • డిజిటల్ కి మ