ఫోర్బ్స్ సంపన్నుల జాబిత..

0
645

  forbs richest peoples details

అత్యంత సంపన్నులైన 100 మంది టెక్ కుబేరలతో ఫోర్బ్స్ తాజా జాబితా రిలీజ్ చేసింది అగ్రస్థానంలో నిలిచిన తొలి 20 మందిలో విప్రో సంస్థ చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, హెచ్‌సిఎల్ సహ వ్యవస్థాపకుడు శివ్ నాడార్‌లకు మాత్రమే భారత్ నుంచి చోటు లభించింది. గూగుల్ సంస్థ అధినేత ఎరిక్ ష్మిడ్, ఉబర్ సంస్థ సిఇఓ ట్రవిస్ కాలనిక్ కంటే వీరు ముందున్నారు. ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన 100 మంది టెక్ బిలియనీర్ల జాబితాలో మైక్రోసాఫ్ట్ సంస్థ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ దాదాపు 78 బిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో నిలువగా, 16 బిలియన్ డాలర్ల నికర సంపదతో అజీమ్ ప్రేమ్‌జీ 13వ ర్యాంకులోనూ, 11.6 బిలియన్ డాలర్ల సంపదతో శివ్ నాడార్ 17వ ర్యాంకులోనూ నిలిచారు.

ఇండో-అమెరికన్ సాంకేతిక దిగ్గజాలైన సింఫనీ టెక్నాలజీ గ్రూప్ సిఇఓ రొమేష్ వాద్వానీ, ఐటి కన్సల్టింగ్, ఔట్‌సోర్సింగ్ కంపెనీ సింటెల్ వ్యవస్థాపకుడు భరత్ దేశాయ్, ఆయన భార్య నీర్జా సేథీలకు కూడా ఈ జాబితాలో చోటు లభించింది. వీరిలో వాద్వానీ 3 బిలియన్ డాలర్ల నికర సంపదతో 67వ స్థానంలో నిలిచారు.ఈ జాబితాలో చోటు దక్కించుకున్న మొత్తం 100 మంది టెక్ శ్రీమంతుల ఉమ్మడి సంపద 892 బిలియన్ డాలర్లుగా ఉందని, గత ఏడాది కంటే ఇది 6 శాతం ఎక్కువని ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. ఈ జాబితాలో సగం కంటే ఎక్కువ మంది అమెరికనే్ల ఉండగా, వీరిలో ఎనిమిది మందికి టాప్-10లో చోటు లభించింది.

అమెరికన్ల తర్వాత ఈ జాబితాలో చైనా 19 మంది శ్రీమంతులతో ద్వితీయ స్థానంలో నిలిచింది. వీరి మొత్తం సంపద 132.7 బిలియన్ డాలర్లు కాగా, ‘అలీబాబా’ ఆన్‌లైన్ మార్కెటింగ్ సంస్థ వ్యవస్థాపకుడు జాక్ మా చైనాలో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. దాదాపు 25.8 బిలియన్ డాలర్ల నికర సంపదతో అతను ఫోర్బ్స్ జాబితాలో ఎనిమిదో స్థానాన్ని దక్కించుకున్నాడు. అలాగే కెనడాకు ఐదుగురు, జర్మనీకి చెందిన నలుగురు టెక్ బిలియనీర్లకు ఈ జాబితాలో చోటు లభించింది.

కాగా, ఈ ఏడాది ఈ జాబితాలో బిల్ గేట్స్ తర్వాత ‘అమెజాన్’ సంస్థ వ్యవస్థాపక సిఇఓ జెప్ బెజోస్ రెండో స్థానంలో నిలిచాడని, గత ఏడాది నుంచి బెజోస్ సంపద 18.4 బిలియన్ డాలర్లు పెరిగి దాదాపు 66.2 బిలియన్ డాలర్లకు చేరుకోవడం, అలాగే ‘ఫేస్‌బుక్’ షేర్ల విలువ 30 శాతం పెరిగి ఆ సంస్థ వ్యవస్థాప సిఇఓ మార్క్ జుకెర్‌బెర్గ్ ఈ జాబితాలో నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకడంతో ‘ఒరాకిల్’ సంస్థ చైర్మన్ లారీ ఎల్లిసన్ నాలుగో స్థానానికి దిగజారారు.

Leave a Reply