బీజేపీ లోకి రాసలీలల తివారీ..ఆ కొడుకుకి టికెట్?

0
250
former ap governor nd tiwari and son rohit join in bjp party

Posted [relativedate]

former ap governor nd tiwari and son rohit join in bjp party
ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్,సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాసలీలల నారాయణ్ దత్ తివారీ ఈ వయసులో రాజకీయంగా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.కోర్టు ద్వారా తన కొడుకుగా నిరూపించుకున్న రోహిత్ శేఖర్ తో కలిసి బీజేపీ లో చేరిపోయారు.బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నివాసం ఈ చేరికకి వేదిక కావడాన్ని కమలం శ్రేణులే జీర్ణించుకోలేకపోతున్నాయి.ఇందుకు గల కారణాలు దేశమంతా తెలిసినవే ..

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ఎన్డీ తివారీ పనిచేసిన రోజుల్లో నిర్వహించిన ఓ స్టింగ్ ఆపరేషన్ అయ్యగారి రాసలీలల్ని బయట పెట్టింది.కాటికి కాళ్ళు ఆరజాపుకునే వయసులో,కదలడానికి కూడా శరీరం,కాళ్ళు సహకరించకపోయినా కామపు చేష్టలతో తివారీ ఎలా రెచ్చిపోయారో abn ఆంధ్రజ్యోతి కళ్ళకి కట్టినట్టు చూపింది.ఈ భాగోతం బయటపడగానే గవర్నర్ గిరీ పోయింది.

ఇక దేశమంతా ఆసక్తి రేపిన ఎపిసోడ్ ఇంకోటుంది. తల్లి ఉజ్జ్వల తో తివారీ కి వున్న సంబంధం వల్లే తాను పుట్టినట్టు రోహిత్ శేఖర్ అనే వ్యక్తి అప్పట్లో కోర్టు మెట్ట్లెక్కారు.తనను కొడుకుగా తివారీ అంగీకరించాలని అయన కోర్టు ద్వారా పోరాడారు.తివారీ అదంతా అబద్ధమని వాదించినా విషయం డిఎన్ఏ పరీక్ష దాకా వచ్చేసరికి అతన్ని కొడుకుగా అంగీకరించారు.ఇప్పుడు ఆ కుమారుడికి రాబోయే ఉత్తరాఖండ్ ఎన్నికల్లో కుమావు ప్రాంతంలో ఓ స్థానం నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేసే అవకాశం కల్పించాలని తివారీ బీజేపీ ని కోరినట్టు తెలుస్తోంది.బీజేపీ ఏ హామీ ఇచ్చిందో గానీ కమలనాధులు మాత్రం ఇలాంటి చరిత్ర వున్న నాయకుడిని పార్టీలోకి తీసుకోవడం మీద నిప్పులు చెరుగుతున్నారు.

Leave a Reply