Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2019 ఎన్నికలకు బాగా ముందస్తుగా వైసీపీ సన్నద్ధం అవుతోంది.ఆ సన్నాహక చర్యల్లో భాగంగా చేపడుతున్న సర్వేలు భవిష్యత్ లో ఆ పార్టీకి చేసే మేలు సంగతేమోగానీ ప్రస్తుతానికి మాత్రం ఎంతోకొంత కీడు చేస్తున్నాయి.మొత్తం 13 జిల్లాల్లోని 175 సీట్లలో సమర్థులైన అభ్యర్థులు ఎవరో తెలుసుకునేందుకు వైసీపీ రెండు నెలల కిందటే ఓ సర్వే చేపట్టింది.అందులో వస్తున్న సమాచారం ఆధారంగా చర్యలు చేపడుతోంది.అలా విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గానికి రెండో సమన్వయకర్తని నియమించడంతో అలిగిన పార్టీ నాయకుడు,మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారాం వైసీపీ కి రాజీనామా చేశారు.అంతటితో ఆగకుండా ఆయన 2014 ఎన్నికల విషయాన్ని ప్రస్తావించారు.పార్టీ చెప్పినట్టు సాయం చేయకపోవడంతో ఆ ఎన్నికల్లో ఆస్తులు అమ్ముకుని పోటీ చేస్తే ఇప్పుడిలా మాట మాత్రం చెప్పకుండా అదనపు సమన్వయకర్తని నియమించడాన్ని సీతారాం తప్పుబట్టారు.
వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు పార్టీ కోసం ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు మాత్రమే అవసరమని మాట్లాడుతున్నారని సీతారాం ఆరోపించారు.పార్టీలో పరిస్థితి చూస్తుంటే వైసీపీ లో మన్నార్ గుడి మాఫియా తయారు అయినట్టుందని సీతారాం తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు.సీతారాం తరహాలో మరికొందరు నేతలు వైసీపీ సర్వే కి బలి కాబోతున్నారు.వీరిలో కొందరిని పార్టీ దూరం పెట్టదలుచుకుంటే మరి కొందరు వారంతట వారే పార్టీ కి దూరం అవుతున్నారు.గుంటూరు జిల్లాకి చెందిన ఇద్దరు ప్రముఖ నేతలు ఈ లిస్ట్ లో ఉన్నట్టు సమాచారం