మోడీ మీద తమిళ్ మాజీ సీఎస్ యుద్ధం?

Posted December 27, 2016

former chief secretary of tamilnadu ram mohan rao fires on modi
నల్ల డబ్బు ,అక్రమాస్తుల కేసులో ఇరుక్కున్న తమిళనాడు మాజీ సీఎస్ పాపిశెట్టి రామ్మోహన్ కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల్ని టార్గెట్ చేశాడు. కేంద్రం తనపై కక్ష కట్టిందని…రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించిందని ఆవేదన చెందాడు.తనకు ప్రాణ ప్రమాద ముందని పదేపదే చెప్పిన రామ్మోహన్ రాహుల్ గాంధీ,మమతా బెనర్జీలకి కృతజ్ఞతలు చెప్పారు .తాను ఇప్పటికీ సీఎస్ నే అని అయన చెప్పుకొచ్చాడు. ఓ సీఎస్ ఇంటి మీదకి crpf ని పంపిస్తారా అని ప్రశ్నించాడు. తమిళనాడులో తన పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని రామ్మోహన్ నిలదీసాడు .జయ బతికి ఉంటే ఇంత ధైర్యం చేసేవాళ్ళా అని రామ్మోహన్ ఆడిగాడు .

తమిళనాడు కి 32 ఏళ్ళుసేవ చేసినందుకు ఇదా ప్రతిఫలం అని రామ్మోహన్ ఆక్రోశం వ్యక్తం చేశాడు .తాను భయపడే వాడిని కాదని ,తమిళనాడు ప్రజాక్షేత్రంలోనే అన్ని తేల్చుకుంటానని చెప్పాడు .శేఖర్ రెడ్డి తో తనకెలాంటి వ్యాపార లావాదేవీలు లేవని రామ్మోహన్ స్పష్టం చేశాడు .తుపాకీ గురిపెట్టి తన కొడుకుని తీసుకెళ్లారని ఆరోపించిన రామ్మోహన్ ..తన ఇంటిలో వారెంట్ లేకుండానే సెర్చ్ చేశారని అన్నాడు .పత్రికల్లో వచ్చినంత డబ్బు తన ఇంటిలో దొరకలేదని చెప్పిన రామ్మోహన్ ఓ రకంగా కేంద్రం మీద,పరోక్షంగా ప్రధాని మోడీ మీద యుద్ధం ప్రకటించాడు .

[wpdevart_youtube]3X3WuwwTDMY[/wpdevart_youtube]

SHARE