కావేరి సెగ..మాజీప్రధాని నిరాహారదీక్ష

Posted October 1, 2016

hd-deve-gowda-759తమిళనాడుకి నీళ్లు విడుదల చేయాల్సిందేనని సుప్రీంకోర్ట్ తీర్పు నేపథ్యంలో మరోసారి కర్ణాటకలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.నేటినుంచి ఆర్రోజులపాటు రోజుకి 6 వేల క్యూసెక్కుల చొప్పున నీళ్లు విడుదల చేయాలన్న తీర్పుని అమలు చేయాల్సిన కర్ణాటక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది.నీటి విడుదలకి ఇదే ఆఖరి అవకాశమని సుప్రీం హెచ్చరించడంతో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.రాజకీయ పార్టీలన్నీ ఈ పరిస్థితుల్లో స్వీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నాయి.

కావేరి బెల్ట్ లో పట్టున్న జేడీ ఎస్ అధినేత ,మాజీ ప్రధాని దేవెగౌడ విధాన సభ ఎదుట నిరాహార దీక్షకి దిగారు.వర్షాలు లేని సమయంలో వారాలు,నెలల వారీగా నీటి విడుదల ఎలా సాధ్యమని అయన ప్రశ్నిస్తున్నారు.

SHARE