ఫ్రెంచ్ లోకి మలయాళం మూవీ..

0
451

premam1
ఓ లోబడ్జెట్ మూవీ రూ.కోట్లు కురిపించింది. హీరోహీరోయిన్లను అందలం ఎక్కించింది. అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ ప్రాంతీయ సినిమాను దేశంలోని ఇతర రాష్ట్రాల వారూ భాష అర్ధం కాకపోయినా చూశారు. ఆ కథలోని ఆర్ధ్రతకు ముగ్ధులైపోయారు. అందరినీ ఇంతగా ఆకట్టుకున్న ఈ సినిమా మలయాళంలో రూపొందిన ‘ప్రేమమ్’.

ఓ వ్యక్తి.. తన జీవితంలో మూడు స్టేజ్‌ల్లో ఎదుర్కొన్న ప్రేమ భావనల తెరరూపమే ‘ప్రేమమ్’. దీనికి ఫ్లాట్‌ అయిపోయే మన నాగచైతన్య తెలుగు రీమేక్‌లో నటిస్తున్నాడు. తమిళంలో ధనుష్‌ చేయాల్సి ఉన్నా.. వెనక్కితగ్గాడు. ఎందుకంటే…ప్రేమమ్ సూపర్‌హిట్ కాగానే తమిళతంబిలు.. మలయాళంలోనే ఈ సినిమాను చూసేశారు. ఇక ఈ చిత్రాన్ని తాను చేసినా ఫలితం ఉండదన్న భావనతో ధనుష్ ఆ ప్లాన్ విరమించుకున్నాడు.

ఇక, అసలు విషయానికొస్తే.. ఈ సినిమాను చూసిన ఒక ఫ్రెంచ్ డిస్ర్టిబ్యూటర్ చూశారట. ఇలాంటి సినిమాలకు ఫ్రెంచ్ వాసులు బ్రహ్మరథం పడతారంటూ.. డబ్బింగ్ రైట్స్ కొనుగోలు చేశారట. త్వరలోనే ఈ చిత్రం ఫ్రెంచ్ వర్షెన్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇండియాలో అందరినీ కట్టిపడేసిన ‘ప్రేమమ్’ ఫ్రెంచ్‌ జనాలనూ అలరిస్తే.. మాలీవుడ్‌కు శుభవార్తే.

Leave a Reply