‘ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌’  తో  సోషల్‌ మీడియా ఫ్రెండ్స్‌..

0
711

  friend request movie halchal social mediaమోడరన్‌ సినిమా పతాకంపై ఆదిత్యా ఓం స్వీయ దర్శకత్వంలో విజయ్‌వర్మ పాకలపాటి సహనిర్మాతగా తెరకెక్కిన చిత్రం ‘ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌’. సోషల్‌ మీడియా నేపథ్యంలో యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి అంతర్జాలంలో విశేష ప్రాచుర్యం లభించింది. అన్ని ప్రాంతాల నుండి యువత స్పందిస్తున్న తీరును గమనించిన నిర్మాతలు సోషల్‌ మీడియా ఫ్రెండ్స్‌ని నేరుగా కలిసే నిమిత్తం ఓ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఎమ్మెల్యే కాలనీలోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో కాలేజీ విద్యార్థులు, ఐ.టి. ప్రొఫెషనల్స్‌ మరియు ఇతర రంగాలకు చెందిన 200కి పైగా యువత పాల్గొని సినిమా ట్రైలర్‌ చూసిన తర్వాత తమకు కలిగిన అనుభూతిని వారి మాటల్లో వ్యక్తం చేశారు. ఇదే కార్యక్రమంలో చిత్ర సహనిర్మాత విజయ్‌వర్మ పాకలపాటి కుమార్తె సుమవర్మ పుట్టినరోజు వేడుకను జరిపారు. ఆ తర్వాత చిత్ర బృందం అందించిన ప్రశ్నాపత్రానికి సోషల్‌ మీడియా ఫ్రెండ్స్‌ జవాబులను లిఖిత పూర్వకంగా వ్రాసి ఇచ్చారు .

Leave a Reply