పండ్లూ, కూరగాయాల్ని అధికంగా తినడం వల్ల ఆరోగ్య స్థాయితో పాటు జీవితంలో ఆనందం స్థాయులు పెరుగుతాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ అంశంపై భారీ స్థాయిలో శాస్త్రీయంగా చేపట్టిన తొలియత్నంగా భావిస్తున్నారు. అసలే మాత్రం పండ్లూ, కూరగాయాలు తినే అలవాటు లేనివారు..రోజుకు ఎనిమిదిపాళ్లు తిన్నప్పుడు జీవన సంతృప్తి పెరిగినట్లు ఈ పరిశీలనలో గుర్తించారు.
పండ్లూ, కూరగాయాలు తినడం వల్ల మానవ ఆరోగ్యంలో మెరుగుదలకన్నా వేగంగా సంతోషంగా ఉద్దీపన పొందుతుందని యూకేలోని వార్విక్ యూనివర్సిటీ పరిశోదకులు ఆండ్రూ ఓస్వాల్డ్ పేర్కొన్నారు. పండ్లూ, కూరగాయాలతో క్యాన్సర్ నుంచి రక్షణ వంటి శారీరక ప్రయోజనాల ప్రభావం కనిపించడానికి ఏళ్ల కొద్దీ సమయం పట్టినా, మానసిక ఆనందం త్వరగా కనిపిస్తుందనీ..రెండేళ్లలో మానసిక సానుకూల ఫలితాలు కనిపించినట్లు పేర్కొన్నారు. 12 వేలలపైగా మందిపై చేపట్టిన అధ్యయనం ద్వారా ఈ అంశాన్ని నిర్ధరించారు.