జనతా గ్యారేజ్ పై అంత నమ్మకమా?

0
671

  full believe janatha garage movie
జనతా గ్యారేజ్ ఆడియో విడుదల వేదిక మీద సినిమా గురించి చాలా మంది మాట్లాడారు.అయితే సినిమాకి పని చేసిన వ్యక్తుల గురించి మాట్లాడినంత స్థాయిలో చిత్రం పై మాట్లాడినట్టు అనిపించలేదు.ఎందుకు ? ఆ సినిమా విజయం మీద నమ్మకం లేకా అనే సందేహం వస్తోందా? అలాంటి డౌట్ లు అవసరం లేదని యూనిట్ సభ్యులంతా చెప్పేశారు.

తన సినిమాల గురించి తక్కువ చెప్పే డైరెక్టర్ కొరటాల శివ జనతా గ్యారేజ్ సూపర్ డూపర్ హిట్ అని తేల్చేసి మిగతా విషయాల జోలికెళ్లారు.దిల్ రాజు ఏకంగా సింహాద్రితో పోల్చేశాడు.ఇక హీరో ఎన్టీఆర్ 12 ఏళ్ల తరువాత ఈ సినిమాతో భారీ హిట్ కొట్టబోతున్న నమ్మకం వ్యక్తం చేశారు.అయితే స్టేజ్ మీద మాట్లాడిన ఒక్కరు గూడా ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి అనే మాట అనలేదు.సినిమా గ్యారంటీ హిట్ అని ముందే చెప్పేసి మిగతా విషయాలు తరువాత మాట్లాడారు.ఇది చూసిన వాళ్ళు జనతా గ్యారేజ్ మీద అంత నమ్మకమా అంటున్నారు..

Leave a Reply