అరవంలో అరిపిస్తున్న శైలజ …

0
600

Keerthi-Suresh-bubly

”నేను శైలజ” సినిమా సక్సెస్ తో హీరోయిన్ కీర్తి సురేష్ అందరి దృష్టిలో పడింది. దీంతో ఏ తెలుగు సినిమా గురించి న్యూస్ వచ్చినా.. అందులో కథానాయిక కీర్తి సురేష్ అంటూ రూమర్ వస్తూ ఉండేది. సూపర్ స్టార్ మహేష్ బాబుతోనూ యాక్ట్ చేయనుంది అన్న టాక్ సైతం వచ్చింది. కానీ.. కీర్తి తెలుగులో అడ్రస్ లేకుండా పోయింది. టాలీవుడ్ లో అవకాశాల్లేకున్నా ఈ చిన్నది కోలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది. యువ హీరోలతో పాటూ సీనియర్లతోనూ జోడీ కట్టే ఛాన్స్ కొట్టేస్తోంది. తమిళనాట శివకార్తికేయన్ తో చేసిన ‘రెమో’ విడుదలకు ముస్తాబు అవుతుండగానే ప్రముఖ హీరో విజయ్ సరసన నటిస్తోంది.

తెలుగు పట్టించుకోవడం లేదేంటి అని ఈ మలయాళ కుట్టిని ప్రశ్నిస్తే.. తెలుగులో సినిమాలు చేయాలనే ఉన్నా కొన్ని కథలు నచ్చక..మరికొన్ని ప్రాజెక్టులకు డేట్స్ సర్దుబాటు చేయలేక ఈ సమస్య వచ్చిందని చెప్తోంది. మాతృబాష మలయాళంలోనూ సినిమా చేసే అవకాశం దక్కలేదని.. కోలీవుడ్ లో బిజీ కావడంతోనే ఇలా జరుగుతోందని అంటోంది కీర్తి సురేష్.

Leave a Reply