బాబు పర్యటనకి భారీ భద్రత..మావోల ముప్పు?

 Posted November 1, 2016

full security to cm chandrababu because of maoists
మల్కన్ గిరి ఎన్ కౌంటర్ నేపథ్యంలో..సీఎం చంద్రబాబు ఒంగోలు పర్యటన కి పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు.మావోల హెచ్చరికల నేపథ్యంలో అణువణువునా జల్లెడ పడుతున్నారు.ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.సీఎం పర్యటన సాగే మార్గాల్లో గత మూడు రోజులుగా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పర్యటించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పర్యటన ఆసాంతం సజావుగా సాగేలా కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు. హెలీప్యాడ్‌ ఏర్పాటు చేసిన ఏబీఎం కళాశాల మైదానం నుంచి కొప్పోలు , ఎ-1 కన్వెన్షన్‌ సెంటర్‌, మినీ స్టేడియం, ఏబీఎం కళాశాల మార్గాల్లో పోలీసులను మొహరించారు.మావోయిస్టు సానుభూతిపరులు, ఫ్రంటల్‌ ఆర్గనైజేషన్ల నాయకుల కదలికలపైనా దృష్టి సారించారు. జిల్లాలోని ప్రత్యేక విభాగం(స్పెషల్‌ బ్రాంచి) సిబ్బందిని ఒంగోలులో మొహరించారు. వీరంతా సోమవారం నుంచే విధుల్లోకి దిగిపోయారు. అనుమానిత వ్యక్తుల కదలికలపై ఆరా తీస్తున్నారు. ప్రత్యేకించి కొప్పోలు ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇక్కడ పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టారు. నెల్లూరు, గుంటూరు జిల్లాల నుంచి పోలీసు సిబ్బంది బందోబస్తు విధులకు హాజరుకానున్నారు. ఇద్దరు అదనపు ఎస్పీలు, 11 మంది డీఎస్పీలు, 40 మంది సీఐలు, 120మంది ఎస్‌.ఐ.లు, 200 మంది

సోమవారం ఉదయానికే బందోబస్తుకు కేటాయించిన పోలీసు బలగాలు ఒంగోలుకు చేరుకోగా- వారికి ఆయా ప్రాంతాల్లో విధులు కేటాయించారు. ఆంధ్రా, ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో ఇటీవల భారీ ఎన్‌కౌంటర్‌, అనంతరం ఆత్మాహుతి దాడులు చేస్తామంటూ మావోయిస్టుల పేరిట పత్రికా ప్రకటన విడుదలైననేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఎస్పీ డాక్టర్‌ సి.ఎం.త్రివిక్రమ వర్మ బందోబస్తు విధులను పర్యవేక్షిస్తున్నారు.ఎ.ఎస్‌.ఐ., / హెడ్‌ కానిస్టేబుళ్లు, 716 మంది కానిస్టేబుళ్లు, 91 మంది మహిళా పోలీసు సిబ్బంది, 440 మంది హోంగార్డులు, 28 మంది ఏఆర్‌ సిబ్బందితో పాటు ఆరు బృందాల స్పెషల్‌ పార్టీ పోలీసులను బందోబస్తుకు వినియోగిస్తున్నారు. వీరితో ఎస్పీ పోలీసు కవాతు మైదానంలో సోమవారం సమావేశమయ్యారు. సీఎం పర్యటన పూర్తయ్యేంత వరకూ అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. సీఎం పర్యటన సాగే మార్గాల్లో మంగళవారం సాయంత్రం కాన్వాయ్‌తో ట్రయల్‌ రన్‌ నిర్వహించారు.

SHARE