Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గాలి జనార్ధన్ రెడ్డి కర్ణాటకకు చెందిన వ్యక్తి అయినా కూడా తెలుగు ప్రజలకు సుపరిచితుడు. ఆయనను ఎక్కువ శాతం మంది తెలుగు వ్యక్తి అనుకుంటూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వ్యాపారాలు ఉండటంతో పాటు, ఆయన పేరు కూడా కాస్త తెలుగు వారి పేర్ల మాదిరిగా ఉన్న కారణంగా గాలి జనార్ధన్ రెడ్డి తెలుగు వ్యక్తి అని అనుకోవడం సహజం. ఆయన మైనింగ్ మాఫియాకు పెట్టింది పేరు. వేల కోట్ల ఆస్తులను అక్రమంగా సంపాదించడానే కేసులు ఎదుర్కొంటున్న గాలి జనార్ధన్ రెడ్డి, జడ్జ్‌కు లంచం ఇచ్చి దేశ న్యాయ చరిత్రలోనే ఒక చెత్త రికార్డును దక్కించుకున్నాడు. అలాంటి గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు హీరోగా వచ్చేందుకు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది.
ఆ మద్య కన్నడకు చెందిన మాజీ ప్రధాని దేవగౌడ తనయుడు కుమారస్వామి కొడుకు నిఖిల్ గౌడ హీరోగా తెలుగులో పరిచయం అని విషయం తెల్సిందే. జాగ్వార్‌తో కన్నడంతో పాటు తెలుగులో ఒకేసారి పరిచయం అయ్యాడు. అయితే ఆయన పెద్దగా సక్సెస్‌ను దక్కించుకోలేక పోయాడు. ఇప్పుడు మైనింగ్ కింగ్ గాలి కుమారుడు తెలుగు సినిమా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. నిఖిల్‌ను పరిచయం చేసినట్లుగానే గాలి తనయుడిని కూడా పరిచయం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొదటి సినిమాకే వంద కోట్ల బడ్జెట్‌ను కూడా పెట్టాలని గాలి భావిస్తున్నాడు. ఒక ప్రముఖ టాలీవుడ్ దర్శకుడి చేతిలో తనయుడిని పెట్టాలని గాలి భావిస్తున్నాడు. వచ్చే సంవత్సరంలో గాలి వారి ఎంట్రీ ఉండే అవకాశాలున్నాయి.