Posted [relativedate]
గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రాహ్మణి వివాహ వైభోగం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే…రోజుకో విశేషం బయటికి వస్తోంది ..వినేవాళ్ల మతి పోగొడుతోంది. తాజాగా బ్రాహ్మణి పెళ్లి సందర్భంగా కట్టిన చీర …పెట్టిన నగల ఖరీదు గురించి తెలిస్తే నోరువెళ్ళబెట్టాలిసిందే…ఆ చీర ఖరీదు అక్షరాలా 17 కోట్ల రూపాయలట..చీర నేతలో బంగారపు తీగలు వాడారు.డిజైన్ లలో నవరత్నాలు పొదిగారంట.చీరకే అంత హడావిడి ఉంటే ఇక నగలు,ఆభరణాల గురించి వేరే చెప్పాలా? పెళ్లి పీటల మీద బ్రాహ్మణి పెట్టుకున్న నగల విలువ దాదాపు 90 కోట్లు అంట.
ఒకప్పుడు ముఖేష్ అంబానీ భార్య నీతా 40 లక్షల రూపాయల చీర కడితే మీడియా దాని గురించి ఎంత హంగామా చేసిందో చూసాం.ఇప్పుడు బ్రాహ్మణి పెళ్లి చీర గురించి వస్తున్న వార్తలు నిజమైతే ఇంకెంత హడావిడి ఉంటుందో వేరే చెప్పాల్సిన పనిలేదు.