Posted [relativedate]
ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చిందనేది సామెత మరోసారి ప్రూవ్ అవుతోంది.అంగరంగ వైభవంగా జరుగుతున్న ఆ పెళ్ళికి బీజేపీ జాతీయ,రాష్ట్ర స్థాయి నేతలకి ఆహ్వానాలు వెళ్లాయి.అంత ఘనమైన వివాహ వేడుకలు చూద్దామని వాళ్ళు కూడా ప్రిపేర్ అయిపోయారు.కానీ ఇంతలో కమలం హైకమాండ్ దగ్గర నుంచి ముఖ్య నేతలకి ఓ సమాచారం వచ్చిందంట.ప్రస్తుతం నల్లధనం,అవినీతి గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నందున గాలి ఇంటి పెళ్ళికి వెళ్లకపోవడమే మంచిదని ఆ సమాచార సారాశం.అయితే అంతకు ముందు గాలితో ఉన్న సంబంధాల రీత్యా పెళ్ళికి వెళ్లకపోతే ఎలా అని ఓ ఆలోచన ..వెళితే పార్టీ ఏమనుకుంటుందో అని భయం మరోవైపు.దీంతో ఒకప్పుడు గాలికి సన్నిహితంగా మెలిగిన సుష్మాస్వరాజ్ వంటి జాతీయ నేతలు ఈ పెళ్ళికి దూరంగా వుండే అవకాశముంది.ఇక కర్ణాటక నేతలు యడ్యూరప్ప లాంటి వాళ్ళు ఏమి చేయాలో అర్ధం గాక సతమతమవుతున్నారు.
ఇక బళ్లారి లోని గాలి ఇంటి మీద దాడి జరిగినపుడు…అయన జైలు పాలు అయినప్పుడు ఆయనెవరో తెలియదని వైసీపీ అధినేత జగన్ అప్పట్లో వ్యాఖ్యానించారు. పైగా గాలి అవినీతి,అక్రమాల గురించి అయన ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ని అడగాలని మీడియా మీద విరుచుకుపడ్డారు.అలాంటిది ఇప్పుడు గాలి ఇంటి పెళ్ళికి వెళ్లేందుకు జగన్ రెడీ అయిపోయారంట. అయన అప్పుడు గాలి అక్రమాల గురించి అడగమన్న బీజేపీ మాత్రం సందేహిస్తోంది.దీన్ని బట్టి ఎవరెవరికి ఎంత దగ్గరో ప్రత్యేకంగా చెప్పాలా?