కూతురి పెళ్లి గాలి అరెస్ట్ కొచ్చింది..

0
276
gali daughter wedding made arrest

Posted [relativedate]

gali daughter wedding made arrest
ఆడంబరం మరోసారి గాలి జనార్దన్ రెడ్డి కొంప ముంచేట్టు వుంది. ఓ సారి జైలుకెళ్లొచ్చినా అయన గారి వ్యవహారశైలితో కాసింత కూడా మార్పు రాలేదు.వ్యవస్థల మీద కనీస గౌరవం చూపించలేదు.ఇంతకు ముందు గనుల అక్రమాలతో ఓ సారి ….న్యాయాన్ని కొనడానికి ప్రయత్నించి మరోసారి గాలి ఊచలు లెక్కబెట్టిన విషయం అందరికీ తెలిసిందే.ఇప్పుడు నోట్ల రద్దు వ్యవహారాన్ని కూడా లైట్ తీసుకుని కూతురి పెళ్లి గ్రాండ్ గా జరిపేందుకు అయన చేసిన చొరవ ఇంకోసారి కటకటాలు లెక్కించే పరిస్థితి తీసుకొచ్చింది. పాత నోట్లని మార్చే క్రమంలో అయన తొక్కిన అడ్డ దారులు గురించి చెప్పి ఓ డ్రైవర్ రాసిన మరణ వాంగ్మూలం తో గాలి చుట్టూ ఉచ్చు బిగిసింది.

గాలి నోట్ల మార్పిడి వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన రెవిన్యూ అధికారి నాయక్ ని ఈ ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు.ఆయన్ని విచారిస్తున్నారు.దీంతో అయన ఇచ్చే సమాచారం ఆధారంగా గాలిని కూడా అరెస్ట్ చేసి విచారించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.ఈ ప్రమాదం ఉందని తెలిసినా గాలి తెగించేసారు.ఒక్కసారి వెళ్లినా పదిసార్లు వెళ్లినా జైలు కి వెళ్లోచ్చినోడు అంటారన్న తెగింపు కాబోలు …

Leave a Reply