Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఒకప్పుడు గనులడబ్బుతో,ఆపై కర్ణాటక రాజకీయాలతో ఎక్కడ చూసినా వెలిగిపోయిన గాలి జనార్దన్ రెడ్డి ప్రభకు ఎదురుదెబ్బ తగిలింది.ఊహించని విధంగా అవినీతి కేసులు,రాజకీయ పరాజయాలు ఉక్కిరిబిక్కిరి చేశాయి.ఆ పై జైలు జీవితం ఇంకా కుంగదీసింది.అయినా కూతురు పెళ్లి తో మళ్లీ వార్తల్లోకెక్కారు గాలి జనార్దన్ రెడ్డి.ఆ పెళ్లి ఆడంబరం చూసి ఇక ఈయన మారరు అనుకున్నారు అంతా.కానీ ఆయనలో ఒక్కసారిగా వైరాగ్యం పెరిగిపోయిందట.అందుకు కారణం మాత్రం ఎవరూ వూహించనది.రామలక్ష్మణుల్లా వుండే అన్నదమ్ముల మధ్య గొడవలట.కరుణాకర్ రెడ్డి తో జనార్దన్ రెడ్డి కి విభేదాలు వచ్చాయట.ఇంకో సోదరుడు సోమశేఖర్ రెడ్డి,మిత్రుడు శ్రీరాములు తన వైపే ఉన్నప్పటికీ కరుణాకర్ రెడ్డి తో గొడవలు జనార్దన్ రెడ్డి ని కుంగదీశాయట .అందుకే ఆ గొడవలకి కారణమైన రాజకీయాలకి దూరంగా వుండాలని గాలి డిసైడ్ అయ్యారట.అయితే అధికారికంగా ప్రకటన చేయాల్సి వుంది.
ఇకపై సేవాకార్యక్రమాలకే పరిమితం కావాలని గాలి నిర్ణయించుకున్నట్టు తాజా సమాచారం.రాజకీయాల నుంచి గాలి మళ్ళించుకోడానికి ఆయన ఇటీవల బెంగళూరు సమీపంలోని బన్నేరుఘట్ట నేషనల్ జూ కి వెళ్లారు.అక్కడ జంతువుల్ని చూసి ముచ్చటపడ్డ గాలి మూడు పులి పిల్లలు,ఓ ఏనుగు పిల్లని దత్తత తీసుకున్నారు.రెండు ఆడ పులి పిల్లల్లో ఒకదానికి అరణ్య,ఇంకోదానికి శాంభవి అని పేరు పెట్టారు.ఇక మగ పులి పిల్లకి శివ అని పేరు పెట్టారు.ఇక ఏనుగు పిల్లకి తన ప్రియమిత్రుడు శ్రీరాములు పేరు పెట్టడం విశేషం.మొత్తానికి జంతువులకి ఆయన పెట్టిన పేర్లు చూస్తే వైభోగాలన్నీ చూసిన గాలికి నిజంగానే వైరాగ్యం వచ్చినట్టు అనిపిస్తోంది.అందులో నిజమెంతో కాలమే చెప్పాలి.