గాలి గుట్టు వీడిందా ..?

Posted December 7, 2016

gali Janardhan Reddy converted Rs 100 cr black money అంగరంగ వైభవంగా జరిగిన గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె పెళ్ళికి ఖర్చు ఎలా పెట్టారు? మోడీ నిర్ణయం తర్వాత అంత పెద్ద ఎత్తున కొత్త నోట్లు ఎలా వచ్చాయి? ఈ ప్రశ్నలకి ఇప్పుడిప్పుడే సమాధానం దొరుకుతోంది.ఐటీ విభాగం ప్రశ్నించినా కాని పని ఓ వ్యక్తి ఆత్మహత్య తో వెలుగులోకి వస్తోంది.

గాలి మధ్యవర్తుల సాయంతో పాతనోట్లు మారుస్తున్నట్లు తెలిసింది. నోట్ల మార్పిడి సమయంలో కొంత నగదు తక్కువగా వచ్చిందని ఈ నోట్ల మార్పిడికి సహకరించిన డ్రైవర్‌కు గాలి అనుచరుల నుంచి బెదిరింపులొచ్చాయి. దీంతో మనస్తాపంతో డ్రైవర్‌ రమేష్‌గౌడ ఆత్మహత్య చేసుకున్నాడు. రమేష్ గౌడ రాసిన సూసైడ్‌నోట్‌తో గాలి గుట్టు వీడినట్టైంది. బళ్లారిలో 20శాతం కమీషన్‌తో 100 కోట్ల పాతనోట్లు మార్పిడి జరుగుతోంది అదే స్థాయి లో ఆంధ్ర ,తెలంగాణ లో కూడా ఇదే తరహాలో కమిషన్ల వ్యాపారం జరుగుతోంది అనే గుసగుసలున్నాయి .

[wpdevart_youtube]gU_UyDEQ6PY[/wpdevart_youtube]

SHARE