గాలి కాళ్లు కడగబోతున్నాడు ..

0
1644

 gali janardhan reddy daughter marriage

గాలి జనార్దన్ రెడ్డి…. కొన్నాళ్లుగా తెరపైకి తక్కువ కనిపిస్తున్న ఈ ఐరన్ ఒర్ కింగ్ ఒకరి కాళ్ళు కడగబోతున్నాడు.అదేలేండి …పిల్లనిస్తున్న మామ హోదాలో అల్లుడి కాళ్ళు కడగబోతున్నాడు.వైస్ హయాంలో కడప లో గాలి తలపెట్టిన ఉక్కు ఫ్యాక్టరీ పేరు గుర్తుందా ? బ్రాహ్మణి…ఆ అమ్మాయే ఇప్పుడు కాబోయే పెళ్లి కూతురు …గాలి ముద్దుల కుమార్తె.ఓ పదిరోజుల కిందట ఆ అమ్మాయి నిశ్చితార్ధపు వేడుకలు బళ్ళారి లో ఘనంగా జరిగాయి.

పెళ్లి కొడుకు హైదరాబాద్ కి చెందిన ఓ పారిశ్రామిక వేత్త కుమారుడు.అతను కూడా విదేశాల్లో వ్యాపార రంగంలో ఉన్నట్టు సమాచారం.పెద్దగా బయటికి చెప్పకుండా నిశ్చితార్ధం జరిపినా అతిధుల్లో ఒకరు ఫోటోలు సోషల్ మీడియా లోఉంచడంతో విషయం లీక్ అయ్యింది.పెళ్లి తేదీ ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది.అయితే పెళ్లికూతురు బ్రాహ్మణి ధరించిన ఆభరణాలు చూస్తే కళ్లు జిగేల్ మనడం ఖాయం.

gali-2

Leave a Reply