Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్ కి ఇంకో హీరో పరిచయం కాబోతున్నట్టు సమాచారం.అయితే ఈసారి వస్తున్నది నట వారసుడు కాదు.రాజకీయ కుటుంబం నుంచి వస్తున్న నటుడు.ఆ హీరో మరెవరో కాదు. ఎన్నో రకాలుగా తెలుగు,కన్నడ ప్రజలతో పాటు దేశమంతా ఎంతోకొంత తెలిసిన గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి.ఎంతో అట్టహాసంగా జరిగిన గాలి కుమార్తె బ్రాహ్మణి వివాహ వేడుకల సందర్భంలో నాలుగు తెలుగు పాటలకు కిరీటి రెడ్డి వేసిన డాన్స్ చూసి ఆహుతులు ఈ కుర్రోడు భలే చేస్తున్నాడే అని కితాబు ఇచ్చారు.ఆ పొగడ్తలకు ఫ్లాట్ అయిన కిరీటి చిన్నగా నాన్న జనార్దన్ రెడ్డి దగ్గర తన మనసులో ఉన్న సినిమా కోరికని బయట పెట్టాడట.అందుకు గాలి కూడా సుముఖంగానే స్పందించినట్టు తెలుస్తోంది.
అసలే కర్ణాటక రాజకీయ నేతలు ఇటీవల వరసగా తమ వారసుల్ని వెండితెరకి పరిచయం చేస్తూ పోతున్నారు.మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు నిఖిల్ జాగ్వర్ తో ఇంట్రడ్యూస్ అయ్యారు. ఇక కొందరుకన్నడ మంత్రుల కొడుకులు కూడా వెండితెరకి పరిచయం అవుతున్నారు.ఇదే టైపు లో ఇప్పుడు గాలి కొడుకు కూడా సీన్ లోకి రాబోతున్నాడు.అయితే ఒక్క కన్నడకే పరిమితం కాకూడదని గాలి భావిస్తున్నాడట.తెలుగులో ఓ పెద్ద డైరెక్టర్ తో కొడుకు కిరీటిని హీరోగా పరిచయం చేయడానికి ఇప్పటికే సంప్రదింపులు కూడా మొదలు అయినట్టు తెలుస్తోంది.అదే సినిమాని కన్నడలో కూడా అంటే ద్విభాషా చిత్రంగా మలచడానికి ఏర్పాట్లు చేస్తున్నారట.కొడుకుతో కేవలం పరిచయం కోసం ఒక్క సినిమా తీయడమే కాకుండా రెండు భాషల్లో పెద్ద హీరోలతో కూడా సినిమాలు తీసేందుకు గాలి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.అదే నిజమైతే దక్షిణాదిలో ఇంకో భారీ ప్రొడ్యూసర్ ముందుకు వస్తున్నట్టే.